సంగీత దర్శకుల తనయులు కూడా సంగీత దర్శకులుగానే చలామణీ అవ్వడం చూస్తూనే ఉన్నాం. సాలూరి రాజేశ్వరరావు తనయుడు కోటి సంగీత దర్శకుడిగా మారాడు. మణిశర్మ వారసుడు కూడా అదే ఫీల్డులో ఉన్నాడు. అయితే ఇప్పుడు ట్రెండు మారింది. ట్రాక్ ఏదైనా సరే…. అందరి దృష్టీ దర్శకత్వంపైనే. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా.. దృష్టి దర్శకత్వంపై పడింది. ఇప్పుడాయన ‘రంగస్థలం’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే… రాజమౌళి దగ్గర పనిచేసే అవకాశం ఉన్నా, సింహా మాత్రం సుకుమార్‌ని ఎంచుకోవడం విశేషం. అంతేకాదు… ”నేను కీరవాణి తనయుడ్ని” అని సుకుమార్‌కి చెప్పకుండా, కేవలం తన ప్రతిభా పాటవాల్ని నిరూపించుకుని సహాయ దర్శకుడిగా పోస్టు కొట్టేశాడట. మరో రెండు మూడు సినిమాలకు సహాయకుడిగా పనిచేస్తే చాలు… ఇండ్రస్ట్రీ నుంచి మరో వారసుడు దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి సిద్ధమైపోయినట్టే.