శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో గెలిచిన బియ్యపు మధుసూదన్ రెడ్డి కాళహస్తిని కామెడీ చేశారు. ఆయన చేష్టలతో జాతీయ మీడియా ఆయనను “కోవిడియట్” గా బిరుదిచ్చింది. ఆలయంలో వెండి కూడా దోపిడీ చేశాడని నియోజకవర్గం మొత్తం తెలుసుకుంది. ఇక ఐదేళ్లలో వెయ్యి కోట్ల వరకూ సంపద దోచుకున్నాడని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. చేసేది కమెడియన్ పనులే కానీ.. తెర వెనుక దోపిడీలో మాత్రం ఏక్ నెంబర్ వన్ విలన్ గా డిసైడయ్యారు. బొజ్జల సుధీర్ రెడ్డికి ఆయన పనితీరే ప్లస్ అవుతోంది.
శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. గత పది ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీయే విజయం సాధించింది. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ, ఓ సారి స్వతంత్ర అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నేత ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తొలిసారి విజయం దక్కించుకున్నారు. ఇక టీడీపీ తరఫున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు మంత్రిగానూ పనిచేసి జిల్లాలో తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గోపాలకృష్ణారెడ్డి కొంతకాలం మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా ఆయన మరణించడంతో గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ ఇన్చార్జి బాధ్యతలు దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతిలో ఓడిన సుధీర్ రెడ్డి ఈ ఎన్నికల్లో మరోసారి తలపడుతున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట, తొట్టంబేడు మండలాలు ఉన్నాయి. ఇక్కడ రెడ్లదే రాజ్యం. బీసీ కేటగిరీలోకి వచ్చే పల్లె రెడ్లు అధికంగా ఉంటారు. గత ఎన్నికల్లో తొలిసారి గెలిచినా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నియోజకవర్గాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న తీరు ప్రజల్లో చర్చోపచర్చలకు కారణం అవుతోంది. ఇలా దోచుకున్న దాంట్లో కోవిడ్ సమయంలో కొంత మంది బియ్యం, ఇప్పులు, పప్పులు పంపిణీ చేశారు. ప్రజలంతా బిచ్చగాళ్లు తానే దానకర్ణుడినని ఇప్పటికీ ప్రచారం చేసుకుంటూడటంతో ఆయనపై పలు వర్గాలు ఫైర్ అవుతున్నాయి. కరోనా టైంలో చికెన్ ఇచ్చానని ముస్లింలను అవమానించడంతో వారు చికెన్ తెచ్చి బియ్యం ఆఫీసు ముందు పడేసి పోయారు. కరోనా సమయంలో ఇతని చేష్టల వల్లే చాలామంది మరణించారని విమర్శలు ఉన్నాయి.
ఐదేళ్ల కాలంలో ఆయన చేసిన నిర్వాకాలకు ముఖ్య కార్యకర్తలందరూ దూరమయ్యారు. ఆయన ఎవరితో దొంగతనాలు చేయించారో వారు కూడా బయటకు వచ్చి.. అంతా చెబుతున్నారు. తమను అరెస్టు చేసి అయినా సరే.. విచారణ చేయాలని.. దొంగను పట్టుకోవాలని బియ్యపు మధుసూదన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. సొంత బావమరిది ఆయనపై చేసిన ఆరోపణలు గతంలో సంచలనం సృష్టించాయి. బొజ్జల లాంటి నేత ప్రాతినిధ్యం వహించిన చోట.. బియ్యం మధుసూదన్ రెడ్డి పరువు తీస్తున్నారని ప్రజలు ఫీలవుతున్నారు.