దర్శకధీరుడు రాజమౌళి తదుపరి చిత్రం గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. హీరో ఎవరు అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. చరణ్, బన్నీ, ధనుష్ లతో పాటు సుబ్బరాజు ల పేర్లు కూడా వినిపించాయి. అయితే బాహుబలి సహా రాజమౌళి సినిమాలన్నింటికీ కథ అందించేది ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అని తెలిసిందే. రాజమౌళి తదుపరి చిత్రం కథని కూడా ఆయనే సిద్దం చేస్తున్నాడు. అయితే ఈ కథ విషయం లో రాజమౌళి తనకి ఇచ్చిన “రిక్వైర్ మెంట్” ని ఆయన వెల్లడి చేసారు. అంటే రాజమౌళి తన తదుపరి చిత్ర కథ ఇలా కావాలని అడిగారన్న మాట. ఇంతకీ రాజమౌళి ఏమడిగాడంటే…
“ఈసారి గ్రాఫిక్స్‌తో పనిలేకుండా ఓ సోషల్ కథని రాసివ్వాలి. ఆ కథ నాకు చాలా ఎగ్జయిటింగ్ అనిపించాలి. ఫలానా కథానాయకులు అని కాదు. ఫలానా కథ అని ప్రేక్షకులు చెప్పుకునేంత ఎగ్జయిటింగ్‌గా ఉండాలి” అని రాజమౌళి నాకు నిక్కచ్చిగా చెప్పాడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అలాంటిది ఎప్పుడొస్తుందో చూడాలి.
ఇదీ కథకుడు గా ఆయన చెప్పింది. మొత్తానికి రాజమౌళి ఈసారి కూడా బాహుబలి తో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికో, మాస్ హీరో తో కమర్షియల్ అంశాలతో సినిమా చుట్టేయడానికో కాకుండా ఎగ్జైటింగ్ కథతో రానున్నడన్నమాట.