ప్రియుడితో గొడవల కారణంగా ఓ నటి తన ప్రాణాన్ని తనే తీసుకుంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే… ‘స్టార్ మా’ ఛానల్లో ప్రసారమయ్యే ‘ప్రవిత్ర బంధం’ సీరియల్లో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఝాన్సీ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఫ్లాట్‌లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకున్నారు.
గత కొంతకాలంగా ఒక అబ్బాయితో ఝాన్సీ ప్రేమలో ఉన్నారని, ఇటీవల ప్రియుడితో ఆమెకు తరచూ గొడవలు జరుగుతున్నాయని ఆమె సన్నిహితులు కథనం. మంగళవారం రాత్రి ఇద్దరూ గొడవ పడ్డారని, తరవాత ఛాటింగ్ చేసుకున్నారని, ఆ తరవాతే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రాధమికంగా అందిన సమాచారం బట్టి తెలుస్తుంది. ఝాన్సీ ప్రియుడు ఎవరు? ఇద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది.