స్పైడర్ ట్రైలర్ కట్ చేయడం లో స్ట్రాటజీ ప్లే చేసారా? అవును, ఇప్పుడు ఇవే సందేహాలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మరో రెండ్రోజులే స్పైడర్ విడుదలకి మిగిలి ఉంది. సినిమాలు చూడటం తో పాటు తెరవెనుక సంగతులని రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రేక్షకులకి, మురుగదాస్ దర్శకత్వం మెద ఉన్న నమ్మకం వల్ల, ఈ సినిమాని అంత శ్రమకోర్చి బైలింగ్వల్ గా తెరకెక్కిస్తున్నారంటే, అందులోని కంటెంట్ ఖచ్చితంగా బాగుంటుందనే అభిప్రాయాల వల్ల సినిమా మీద పెద్ద అంచనాలున్నాయి. కానీ ఇలాంటి సంగతులని మరీ ఎక్కువగా పట్టించుకోకుండా, పోస్టర్ ని బట్టో, ట్రైలర్ ని బట్టో సినిమాకి వెళ్ళే బి సి సెంటర్ ఆడియెన్స్ మాత్రం, ట్రైలర్ వాళ్ళ అంచనాలకి తగినట్టు లేదనీ కాస్త ఫీలయినట్టు తెలుస్తోంది.
అయితే ఈ విషయం లో మురుగదాస్ కావాలనే, ట్రైలర్ కట్ చేసే విషయం లో స్ట్రాటజీ ప్లే చేసినట్టు తెలుస్తోంది. ట్రైలర్లోనే, సినిమా హైలెట్స్ చూపించేసినా, లేక వాటి గురించి క్లూస్ ఇచ్చేసినా, ప్రేక్షకులకి థియేటర్లో కలిగే థ్రిల్ తగ్గుతుందని భావించి, ఉద్దేశ్యపూర్వకంగానే అవేవీ రివీల్ చేయకుండా ట్రైలర్ కట్ చేయాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. అలాగే, స్పైడర్ అన్న టైటిల్ వినగానే హీరో ఇందులో స్పై చేస్తాడని అర్థంవుతున్నపటికీ, ఈ విషయం లోనూ ఎక్స్పెక్టేషన్స్ ని కరెక్ట్ సెట్ చేయడానికి మురుగదాస్ ప్రయత్నించి సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. స్పై అనగానే పూర్తిగా గూఢచర్యానికి సంబంధించిన ఇతివృత్తమేమో అని భావించి మరీ జేంస్ బాండ్ తరహా కథ ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేందుకే, మొదటి టీజర్ లో నే ఇది టెర్రరిజం కి సంబంధించిన ఇతివృత్తమనీ సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకులకి వివరించారు.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ప్రేక్షకులకి ఇంచుమించు గా వారు ఎలాంటి సినిమా చూడబోతున్నరనేది మాత్రం కరెక్ట్ గా తెలియజేసి, వారు చూడబోయే థ్రిల్స్ ని పూర్తిగా దాచేసి, థియేటర్లో సర్ప్రైజ్ చేసే ప్లాన్ మురుగదాస్ చేసినట్టు తెలుస్తోంది. అందులోనూ, మురుగదాస్ సినిమాల్లో సినిమా అంతా ఒకే టెంపో లో ఉండకపోయినా, మధ్య మధ్యలో కొంచెం బోర్ అనిపించినా, సినిమా కి ఆయుపట్టు గానిలిచే ఒకటి రెండు ఎపిసోడ్స్ మాత్రం చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఉదాహరణకి, రమణ (ఠాగూర్ మాతృక) లో హాస్పిటల్ సీన్ ఫ్లాష్ బ్యాక్ సీన్ అలా నిలిస్తే, కత్తి లో (ఖైదీ 150 మాతృక) లో విలేజ్ ఫ్లాష్ బ్యాక్, టనెల్ లో వృద్దులు దూరే సీన్ అలా ప్రేస్ఖకులని ఆకట్టుకున్నాయి. ఇక స్పైడర్ లోనూ ఏకబిగిన ప్రేక్షకులని మెస్మరైజ్ చేసే ఒక ఎపిసోడ్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇవేవీ ట్రైలర్ లో చూచాయిగా కూడ కనిపించనివ్వకపోవడం మాత్రం ఖచ్చితంగా మురుగదాస్ స్ట్రాటజీ అని ఒప్పుకోవాల్సిందే!!