నటుడు కమల్‌హాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ తమ రాజకీయ ప్రవేశానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరిలో ఎవరు ముందుగా పార్టీ ఏర్పాటు చేస్తారో ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే. అయితే, సుహాసిని మణిరత్నం కూడా రాజకీయాల్లోకి రావడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయ రంగ ప్రవేశం గురించి సుహాసిని స్పందిస్తూ.. “హీరోలే రాజకీయాల్లోకి రావాలా, తాము రాజకీయాల్లోకి రాకూడదా?” అంటూ ప్రశ్నించడం తో, ఆవిడ కూడా రాజకీయాల్లోకి రావడానికి ప్రణాలికలు సిద్దం చేసుకుంటున్నట్టు అర్థమవుతోంది. ‘ప్రజలు జయలలితకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చారు. మాకూ ఆ బాధ్యతలను అందించండి.. రాజకీయాల్లోకి రావడానికి మేమూ సిద్ధమే’ అని నటి సుహాసిని మణిరత్నం వ్యాఖ్యానించారు. దీంతో నటులకే కాదు నటీమణులకు పొలిటికల్ ఫీవర్ పట్టుకుందంటూ కథనాలు మొదలయ్యాయి. నటీమణులు రాధిక, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్, నదియ కూడా రాజకీయాల్లోకి రావడానికి సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.