‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు సుకుమార్ రాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ముంబాయిలో వున్నారు. అయితే సుకుమార్ ఈవెంట్ లో లేని లోటుని కొరటాల శివ తీర్చారు. ‘తాను సుకుమార్ తరపున మాట్లాడుతున్నా” అని చెప్పి ప్రసంగం ఇచ్చారు. యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు చెప్పారు.
” అల్లు అర్జున్ గొప్ప స్టార్, ఈ సినిమాతో ఇంకా గొప్ప స్టార్ అవుతాడు, బన్నీ కోసం ఇంక పెద్ద కధలతో పెద్దపెద్ద వాళ్ళు సినిమాలు తీస్తారు, ఇది పక్కా. మైత్రి మూవీస్ మా బ్యానర్. వాళ్ళుకి సినిమా తప్పా ఇంకేం తెలీదు. మంచి సినిమాలు తీయడానికే పరిశ్రమలోకి వచ్చారు. ఈ సినిమాలో భాగమైన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు” అని సుకుమార్ తరపున మాట్లాడారు కొరటాల.
దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉండటంతో సుకుమార్‌గారు ఈవెంట్‌కి రాలేదు. ‘సినిమా తీసినోడు పోతాడు, సినిమా చూసినోడు పోతాడు. సినిమానే శాశ్వతం’ అని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు’ అని చెప్పుకొచ్చారు