‘పుష్ష 2’ విడుదలపై ఎన్నో డౌట్లు. ఆగస్టు 15న రావాల్సిన సినిమా ఇది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే ఈ పాటికి ‘పుష్ష 2’ ప్రమోషన్లు ఫుల్ స్వింగులో జరిగేవి. కానీ.. డిసెంబరు 6కు వాయిదా పడింది. అయితే ఇప్పటికీ అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. డిసెంబరు 6కైనా ‘పుష్ష 2’ వస్తుందా? లేదా వచ్చే యేడాదికి వాయిదా పడుతుందా? అనే ప్రశ్నలు రేగుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ మాత్రం ఈసారి డిసెంబరు 6 డేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు అంటున్నాడట. నిర్మాతలదీ అదే మాట. ఇప్పటికే సినిమా వాయిదా పడడం వల్ల ఆర్థికంగా భారం పడింది. డిసెంబరు 6కీ రాకపోతే… మరింత నష్టం వాటిల్లుతుంది. అందుకే సుకుమార్ ఇప్పుడు ఓ కీలకమైన నిర్ణయం తీసుకొన్నాడని టాక్.
Also Read : ‘పుష్ష 2’ తరవాత.. బన్నీ ఏం చేస్తాడు?
ప్రస్తుతం హైదరాబాద్ లో పుష్ష 2 షూటింగ్ జరుగుతోంది. అల్లు అర్జున్ తదితరులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇక నుంచి ఏక ధాటిగా షూటింగ్ చేస్తే అక్టోబరు చివరి నాటికి షూటింగ్ పూర్తవుతుంది. నవంబరు మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవొచ్చు. అయితే సెప్టెంబరు నాటికే సినిమాని ఫినిష్ చేయాలనుకొంటున్నాడట సుకుమార్. అందుకోసం స్క్రిప్టులోనే కీలకమైన మార్పులు చేశాడని టాక్. కొన్ని సన్నివేశాల్ని స్క్రిప్టు దశలోనే ట్రిమ్ చేశాడని, ఒకట్రెండు ఎపిసోడ్లు పూర్తిగా తొలగించాడని తెలుస్తోంది. అందువల్ల షూటింగ్ డేస్ కలిసొస్తాయి. ఇప్పుడు వారం రోజులు అదనంగా దొరికినా చాలు అనుకొనే పరిస్థితి ఉంది. అందుకే స్క్రిప్టు దశలోనే ఎడిటింగ్ చేసేసి, దానికి తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట. కొంతమంది బడా దర్శకులు కావాల్సిన దానికంటే ఎక్కువ షాట్లు తీసుకొంటారని, లెంగ్త్ గురించి పట్టించుకోకుండా, ఎడిటింగ్ టేబుల్ దగ్గర షార్ప్ చేస్తూ కూర్చుంటారని బయట టాక్ ఉంది. సుకుమార్ అదే టైపు. తన సినిమాలు లేట్ అవ్వడానికి కారణం ఇదే. అయితే ‘పుష్ష 2’ విషయంలో సుకుమార్ కి ఆ వెసులుబాటు లేదు. అనుకొన్న సమయానికి ప్రొడక్ట్ ఇవ్వాలంటే కొన్ని ఎడ్జస్ట్మెంట్లు తప్పనిసరి. అందుకే ‘పుష్ష 2’ విషయంలో ఈ నిర్ణయం తీసుకొన్నాడట. అటు బన్నీకి గానీ, ఇటు నిర్మాతలకు గానీ అంతకంటే కావల్సింది ఏముంది? అందుకే ఈ విషయంలో బన్నీతో పాటు నిర్మాతలూ హ్యాపీగా ఉన్నారు.