అమరావతి అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో ఎన్నో రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నాయని.. విచారణ చేపడితే సార్థకత ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించారు. వెంటనే విచారణ చేపట్టడానికి నిరాకరించింది. అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము దాఖలు చేసిన సవాల్ పిటిషన్ ను వెంటనే విచారించారంటూ పదే పదే ఏపీ ప్రభుత్వ లాయర్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావిస్తున్నారు.
మూడు రోజుల కిందటే ఆయన ఓ సారి ఇలా ప్రస్తావిస్తే.. మార్చి 28న విచారణ నిర్వహిస్తమని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే మూడు రోజులు జరగక ముందే మరోసారి ముందే విచారణ చేపట్టాలని నిరంజన్ రెడ్డి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ధర్మాసనంలో కొత్తగా జస్టిస్ అమానుల్లా ఖాన్ చేరారు. అందుకే నిరంజన్ రెడ్డి మరోసారి ముందస్తు విచారణకు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అయితే జస్టిస్ కేఎం జోసెఫ్ మాత్రం అంగీకరించలేదు. 28వ తేదీకన్నా ముందే కేసు విచారణ జరపాలన్న ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదుల విజ్ణప్తిని తోసిపుచ్చింది ధర్మాసనం.
రాజ్యాంగ పరమైన అంశాలు అమరావతి కేసులో చాలా ఇమిడి ఉన్నాయని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ పేర్కొన్నారు. 28వ తేదీ ఒక్క రోజే విచారణ సరిపోదని… బుధ, గురువారాల్లో అంటే 29,30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సిజెఐ సర్క్కులర్ ఉందని గుర్తు చేసింది ధర్మాసనం. అయితే సిజెఐ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదు కోరారు. దీన్ని కూడా తోసిపుచ్చింది. ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రజల డబ్బుతో.. సొంత రాజధానిపై కుట్రలు చేస్తూనే ఉంది.