‘సైరా’ ఆలస్యం.. ఆ చిత్ర బృందానికి సరికొత్త సమసల్ని తెచ్చిపెడుతోంది. ‘సైరా’లో పనిచేసే సాంకేతిక నిపుణులు ఇప్పుడు డేట్లు సర్దుబాటు కాక సతమతమవుతున్నారు. అన్నీ అనుకొన్నట్టు జరిగితే సెప్టెంబరులోనే ఈ సినిమా మొదలవ్వాల్సింది. కానీ.. ఆలస్యమైంది. దాంతో టెక్నీషియన్లు కంగారు పడుతున్నారు. ఇప్పటికే మరో సినిమా ఒప్పుకొన్నవాళ్లంతా మెల్లగా జారుకొనే పనిలో ఉన్నారు. అందులో భాగంగా సైరాలో తొలి వికెట్ పడిపోయింది. కెమెరామెన్ రవి వర్మన్ ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. కమల్ – శంకర్ల ‘భారతీయుడు 2’ టీమ్‌లో ఆయన ఉన్నారు. ఈ సినిమా కోసమే ‘సైరా’ వదులుకోవాల్సి వస్తోంది. ఆయన స్థానంలో రత్నవేలుని తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ‘రంగ స్థలం’ సినిమాతో బిజీగా ఉన్నాడు రత్నవేలు. ‘రంగస్థలం’ పూర్తయిన తరవాతే ‘సైరా’ని మొదలెట్టాలన్నది చిత్రబృందం ఆలోచన. అందుకే… రత్నవేలుని ఎంచుకొంటే బాగుంటుందని భావిస్తున్నారు. ‘ఖైది నెం. 150’కీ రత్నవేలు పనిచేశారు. కాబట్టి.. వేవ్‌లెంగ్త్స్ బాగా కలిశాయి. ‘సైరా’ మరింత ఆలస్యమైతే మాత్రం మరికొన్ని వికెట్లు పడే ప్రమాదం ఉంది.