మనుషుల్లో నాయకత్వ లక్షణాలు బయటపడేది సమస్యలు వచ్చినప్పుడే. నిజమైన నాయకులు సునామీ ఎదురొచ్చినా .. ఎదుర్కొనేందుకు రెడీగా ఉంటారు. అందులో గెలుస్తామా.. ఓడిపోతామా అన్నది వారి మైండ్‌లోకే రాదు. ఎదుర్కోవడం కూడా గెలుపే అనుకుంటారు. అందుకే వారికి ఏ ఫలితం వచ్చినా విజయమే. రెండో రకం కూడా ఉంటారు.. ఏం జరిగితే అది జరుగుతుందిలే అని దేవుడిపై భారం వేసి ఇంట్లో పడుకుంటారు. పోయిన వాళ్లు పోగా.. మిగిలిన వాళ్లను తానే కాపాడానని చెప్పుకుని అదే తన నాయకత్వం అని ప్రచారం చేసుకుంటారు. ఈ రెండు లక్షణాల్లో చంద్రబాబు మొదటి రకం. మొదటి సారి సీఎంంది 30 ఏళ్ల కిందట… ఆయన పదిహేనో ఏడాది సీఎంగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ అదే డెడికేషన్. ప్రజల కోసం.. రాష్ట్రం కోసం ఆయన పని చేయాల్సి వస్తే… అంత కంటే గొప్ప అవకాశం లేదని అనుకుంటారు. శక్తికి మించి పని చేస్తున్నారు. నలభైల్లో ఎలా పని చేశారో.. ఇప్పుడు 70ల్లో కూడా అదే చేస్తున్నారు. చంద్రబాబును రెగ్యులర్ గా చూస్తున్న వారు ఆయనకు వయసు పైబడిందని అనుకోలేరు కూడా.
బెజవాడ వాసులకు గత శతాబ్దంలో రాని కష్టం
విజయవాడలో బారులు తీరిన ఫైరింజన్లు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకివన్నీ అనుకున్నారు. కానీ అక్కడే చంద్రబాబు ఆలోచనలు భిన్నమని తెలిసేది. ఇళ్లల్లోకి వచ్చిన నీరు ..వరద వెళ్లిపోయింది. కానీ అది తీసుకు వచ్చిన బురద మాత్రం అలాగే ఉంది. ఆ ఇళ్లను శుభ్రం చేసుకోవాలంటే.. బాధితులకు అంత తేలికగా అయ్యే పని కాదు. అందుకే చంద్రబాబు ఆ బాధ్యత తీసుకున్నారు. ఫైరింజన్లను తెప్పించారు.. శానిటేషన్ వర్కర్లను రప్పించారు. ఇళ్లను శుభ్రం చేయించారు. ఈ ఆలోచన చంద్రబాబు ఎలా వచ్చిందో కానీ.. ప్రజలు మాత్రం బాబు బంగారం అని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ప్రకృతి విపత్తుల్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ప్రకృతి అల్టిమేట్ . శిక్షిస్తే శిక్ష అనుభవించాల్సిందే. అనుగ్రహిస్తే వరాలు పొందాల్సిందే. కానీ ప్రకృతి ప్రకోపం నుంచి మనల్ని మనం కాపాడుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది. దానికి కావాల్సింది నాయకత్వం. విజయవాడకు ముంపు వస్తుందని ఎవరూ అనుకోలేదు. కొన్ని దశాబ్దాలుగా పొంగని బుడమేరు మళ్లీ పొంగుతుందని అధికారులు కూడా ఊహించలేరు. ఇంకెక్కడి బుడమేరు అని చెప్పి కబ్జాలు చేసిన వైసీపీ నేతలు.. చంద్రబాబు హయాలో బుడమేరు ఆధునీకీకరణ కోసం విడుదల చేసి నిధులు మింగేసి.. ఆమోదించిన పనులు క్యాన్సిల్ చేసిన జగన్ కూడా అనుకోలేదు. అందరి దృష్టి.. కృష్ణాకు వస్తున్న వరదలపైనే ఉంది. ఏడు.. ఎనిమిది..తొమ్మిది..పది అని పెరుగుతూనే ఉంది. కృష్ణాకు వరద వస్తే.. కృష్ణలంకకు భయం.. మిగతా విజయవాడ సేఫ్.. కానీ ఈ సారి సింగ్ నగర్ వైపు మునిగిపోయింది. అప్పుడు కానీ అర్థం కాలేదు.. బుడమేరు ముంచేసిందని.
ప్రకృతిని నియంత్రించలేం కానీ… మనల్ని మనం కాపాడుకోవచ్చు !
విషయం అర్థమయిన తర్వతా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో చంద్రబాబుకు అర్థమైపోయింది. అందుకే వెంటనే రంగంలోకి దిగిపోయారు. కలెక్టరేట్ నే ఇంటిగా మార్చుకున్నారు. అప్పట్నుంచి ఆయన పనితీరు చూసిన వారికి… పాతికేళ్ల కుర్రాడయినా ఇంత ఉత్సాహంగా చేయగలగడా అన్న డౌట్ వస్తుంది. చంద్రబాబు ఇప్పుడు తన గురించి ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పదిహేనో ఏడాది సీఎంగా ఉన్నారు. మిగతా కాలమంతా ప్రతిపక్షంగా ఉన్నారు. ఆయన తన పనితీరు గురించి సర్టిఫికెట్ల కోసం పని చేయాల్సిన అవసరం లేదు. ఆయన లక్ష్యం ప్రజలు ఇబ్బంది పడకూడదనే. అంతే.. రోజుకు రెండు గంటలే నిద్రపోతూ.. మిగతా సమయం మొత్తం బెజవాడ ప్రజల కోసం కేటాయించారు. దీనిపై ప్రశంసించేవారు ఉన్నా.. విమర్శలు చేసేవారు కూడా ఉన్నారు. వైసీపీ నేతలు.. పబ్లిసిటీ స్టంట్ అన్నారు. కానీ చంద్రబాబు ఒకటే మాట చెప్పారు.. నాయకుడు అయిన ముఖ్యమంత్రి ఏసీ గదుల్లో కూర్చుని మిగతా వారందర్నీ బురదలోకి దిగి ప్రజల్ని ఆదుకోవాలంటే.. మనస్ఫూర్తిగా చేస్తారా ?. అదే నేను కూడా అదే పని చేశానను కాబట్టి అందరికీ చెప్పే హక్కు కూడా వచ్చిందన్నారు. ఇందులో వంద శాతం నిజం ఉంది. చంద్రబాబు కాలికి మట్టి అంటకుండా ఇంట్లో కూర్చుని ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే… అధికారులు ఇంత నిబద్ధతగా పని చేసి ఉండేవారా. చాన్సే లేదు. చంద్రబాబుకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు.. క్రైసిస్ మెనేజ్ మెంట్ గురించి అంత కంటే తెలుసు., దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవాలో ఇంకా బాగా తెలుసు. నష్టపోయేది ప్రజలేకగా నా షర్టు ఎందుకు నలగాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అదే అసలైన నాయకత్వ లక్షణం.
ప్రజలకు జరిగిన ప్రతి చిన్న నష్టాన్నీ భర్తీ చేయాలనే ఆలోచన
ఆయన ఆలోచన ప్రజలకు జరిగే ప్రతి నష్టాన్ని ఎలా భర్తీ చేయాలనే. ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశం పెట్టారు. బ్యాంకర్లతో మాట్లాడారు. చివరికి వాహనాల సర్వీసింగ్ కూడా ఉచితంగా చేయించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఆలోచించారు. పదేళ్ల కిందట.. వైజాగ్‌ను తుడిచి పెట్టేసినంత పని చేసిన హుదూద్ సమయంలో చంద్రబాబు ఎలా ఆ నగరాన్ని పునర్నిర్మించేందుకు పాటుపడ్డారో ఇప్పుడు విజయవాడ ప్రజల కోసం అలా కష్టపడ్డారు. ప్రజలకు వ్యక్తిగత నష్టం ఎక్కువ జరిగింది . దాన్ని భర్తీ చేయడానికి చంద్రబాబు శ్రమిస్తున్నారు. మొదటి నుంచి చంద్రబాబుది ఇదే క్రైసిస్ మేనేజ్ మెంట్ ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కోనేందుకు రెడీ అయిపోతారు కానీ.. కాలమే సమాధానం చెబుతుందని గాలికి వదిలేయలేదు. ప్రజల్ని బలివ్వలేదు. ఎంత చేసినా ప్రజలు గుర్తుంచుకుంటారా అన్న నిరాశావాదానికీ తావివ్వలేదు. ఎందుకంటే ఆయన నిజమైన స్టేట్స్‌మన్. 2014-19కాలంలో విభజిత ఏపీకి.. ప్రజలకు స్వర్ణయుగం. పరిపాలనా పరంగా అద్భుతంగా సాగింది. పరిశ్రమలు.. పెట్టుబడులు భారీగా వచ్చాయి. ఒక్క చార్జీ కూడా పెంచలేదు. చంద్రబాబు ఆయన పనితీరును.. ఫలితాలను చూసుకుని ముచ్చటపడ్డారు. ప్రజలు ఖచ్చితంగా మరో చాన్స్ ఇస్తారనుకున్నారు . కానీ అత్యంత ఘోరంగా ఓడించారు. మరొకరు అయితే.. ప్రజలపై నమ్మకం కోల్పోయేవారు. ఇంత కష్టపడినా గుర్తించలేదే అని నిరాశకు గురయ్యేవారు. కానీ చంద్రబాబు ఎప్పుడూ అనుకోలేదు. అదే ఆయన స్పిరిట్. అందుకే.. కిందకు జారినా… పైకి ఎక్కడానికి ఆయనకు ఎక్కువ కాలం పట్టడంలేదు.
బాధితుల్ని నేరుగా కలిసేందుకు కూడా వెనుకాడని సీఎం
చంద్రబాబు క్రైసిస్మేనేజ్మెంట్లో మరో ఉన్నతమైన లక్ష్యం నేరుగా బాధితుల్ని కలవడం. కెలామిటీస్ సమయంలో .. ప్రజలు ఎంత కోపంగా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. సర్వం కోల్పోయిన లేదా నష్టపోయిన కోపం వారికి ఉంటుంది. అందుకే ప్రభుత్వ బాధ్యులు ఎవరూ వారిని ఫేస్ చేయడానికి ఆసక్తి చూపించరు. వారు చూపించే కోపాలన్ని మీడియా చిలువలు పలువలుగా ప్రచారం చేస్తుంది. ఇలాంటి ప్రమాదాలుంటాయని తెలిసినా చంద్రబాబు వరద బాధితులకు ఎదురెళ్లారు. బాధల్లో ఉన్న వారు ఆవేశపడినా ఓదార్చారు. అధికారులు, రాజకీయ నేతలకు కూడా అదే చెప్పారు. ప్రజలు వరద నష్టాల్లో కూరుకుపోయి ఎమోషన్ లో ఉన్నారని.. వారు ఓ మాట అన్నా సరే పట్టించుకోవద్దని.. వారిని ఆదుకునే విషయంలో వెనక్కి తగ్గవద్దని స్పష్టం చేశారు. ఇప్పుడు కాకపోయినా అంతా సర్దుకున్నాక మనం చేసిన సేవలు గుర్తుంచుకుని ప్రజలే సంతృప్తి చెందుతారని.. చంద్రబాబుభావన. అయితే ప్రజలు ఓ ప్రశ్న వేస్తేనే తిరుగుబాటు అని ప్రచారం చేసే మీడియా ఉన్న సమయంలో ఇలాంటిప్రయత్నాలు సాహసమే. అయినా చంద్రబాబు ఆ సాహసం చేశారు. బాధితులకు ఎదురెళ్లి సమస్యలు కనుక్కుని పరిష్కరం చూపారు. కొన్ని చోట్ల బాధితుల ఆగ్రహం కనిపించింది. అయినా సముదాయించారు కానీ.. ఎక్కడా తగ్గలేదు. అదే సమయంలో.. వారిని ఫేస్ చేయడానికి చంద్రబాబు తగ్గలేదు. అక్కడే ఆయన అనేక మంది అభిమానాన్ని రెట్టింపు చేసుకున్నారు.
ఏడ్చే ప్రతిపక్షనేత ఉండటం బాబు దురదృష్టం
అయితే చంద్రబాబుకు ఇప్పుడు సమ ఉజ్జీ అయినా ప్రతిపక్ష నేత లేకపోవడం అది పెద్ద మైనస్. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి అదే నిజమని నమ్మించి పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయ నాయకుడు ప్రత్యర్థిగా ఉండటం.. చంద్రబాబుకు కాదు ప్రజలకు నష్టం. బుడమేరు ఏరు..ఏలూరు వైపు పోతుందని తెలిసో తెలియదో.. కానీ దాన్ని చంద్రబాబు ఇంటి మునకకు ముడిపెట్టేశారు. దాన్ని సమర్థించుకోవడానికి ఏకులు.. లాకులు. గేట్లు.. నదులు అంటూ వింత వాదనలు. అదే సమయంలో చంద్రబాబు ఫెయిలైపోయారని కడుపు మంట. ఐదేళల పాటు సీఎంగా ఉండి… ఒక్క విపత్తులోనూ ప్రజలకు ముందుకు రాని నాయకుడు జగన్. పైగా సీఎం వస్తే పనులు కావని వాదించే వింత మనస్థత్వం. ఆయన నుంచి అంతకు మించి పనితీరును ఆశించలేం . వారు కానీ.. వారి పార్టీ నేతలు కానీ ఐదేళలలో ఎంత సంపాదించారో చెప్పడం కష్టం..కానీ బెజవాడలో ప్రజలకు కనీసం వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మొత్తంగా ఏపీకి హోదా లేని ప్రతిపక్షం ఓ పెద్ద మైనస్ అనుకోవచ్చు. కానీ చంద్రబాబు పనితీరును అందుకుని ఆయన స్థానానికి చేరుకునేందుకు ప్రయత్నించాలంటే.. అంతకు మించిన ఎనర్జీతో.. క్రైసిస్మేనేజ్మెంట్తో కష్టపడేవారు రావాలి. జగన్ లో అలాంటివి కోశానా లేవని స్పష్టమయింది.
చంద్రబాబు సీఎంగా ఉండబట్టే నాడు విశాఖ.. నేడు విజయవాడ సేఫ్ !
రాజకీయ నేతలు వేరు… రాజకీయ వేత్తలు వేరు. రాజకీయ నేతలు తమ వ్యక్తిగత స్వార్థం చూసుకుంటారు.. రాజకీయ వేత్తలు.. ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడమే తమ స్వార్థమనుకుంటారు. చంద్రబాబు ప్రజల బాధ్యతను నెరవేర్చడమే తన స్వార్థమనుకునే వ్యక్తి. పని చేయకపోయినా పర్వా లేదు కానీ.. పని చేసే వాళ్లని విమర్శించి చేయనివ్వకుండా చేయడం అనేది మహా పాపం. అలాంటి పనిని ప్రస్తుతం ఏపీలో.. కొంత మంది చేస్తున్నారు. అయితే ఇలాంటి వారి మాటలకు నిరాశపడే వ్యక్తి కాదు చంద్రబాబు. అందుకే ప్రజలకు భరోసా లభిస్తోంది. అందరూ.. బాబు బంగారం అని మనసులో అనుకుంటున్నారు. కానీ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా వంద శాతం ఎప్పుడూ ఎవర్నీ అభిమానించరు. రాజకీయాల్లనూ అంతే. చంద్రబాబు ఏం చేసినా వ్యతిరేకించేవారు ఉంటారు. విమర్శిస్తూనే ఉంటారు. అలాంటివారిని మైనస్ చేసి చూస్తే .. బాబు ఎంత బంగారమో అందరికీ క్లారిటీ వస్తుంది. ఇలాంటి క్రైసిస్ లు వచ్చినప్పుడు చంద్రబాబు విలువ ఏంటో తెలుస్తుంది. అందుకే చంద్రబాబు క్రైసిస్ మేనేజ్ మెంట్ గురు. బెజవాడ ప్రజల తరపున చంద్రబాబుకు మా అభినందనలు కూడా !