ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి టీడీపీని ఓడించాలని పిలుపునిస్తానంటూ… తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేస్తున్న సవాళ్లపై… ఆయన సామాజికవర్గానికి చెందిన సంఘాలే తిరుగుబాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. యాదవ గర్జన పేరుతో నిర్వహించే సభలో రాజకీయ ప్రసంగాలు చేస్తే అక్కడికక్కడే అడ్డుకోవాలని.. యాదవ సంఘాలు నిర్ణయించుకున్నారు. యాదవ గర్జన పేరుతో.. మూడో తేదీన… గుంటూరులో బహిరంగసభ నిర్వహించనున్నారు. అన్ని పార్టీల యాదవ సామాజికవర్గ నేతల్ని ఈ కార్యక్రమానికి పిలవనున్నారు. అయితే.. ఇదేదో.. తాను… నిర్వహిస్తున్నట్లుగా తలసాని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ సభ వేదికగా.. చంద్రబాబును ఓడించాలని పిలుపుస్తానని బహిరంగంగనే చెప్పుకుంటున్నారు. దీంతో అఖిలభారత యాదవ మహాసభ అప్రమత్తమయింది. ఆ సంఘానికి చెందిన కొంత మంది నేతలు… హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
అఖిలభారత యాదవ మహాసభ సభను.. తలసాని రాజకీయం చేయడంపై.. అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకటనలు విడుదల చేశారు. తలసాని శ్రీనివాస్యావ్.. రాజకీయ అవసరాల కోసం.. మొత్తం యాదవ సామాజికవర్గాన్ని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. యాదవ గర్జనకు తలసాని ఏ పార్టీ తరపున వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసున్నారు. యాదవులను ఐక్యం చేయాల్సిన తలసాని వ్యక్తిగత స్వార్దం కోసం విడగోడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదవ రాజకీయ ప్రముఖుని ఆయన యాదవ గర్జనకు వస్తే సరే కానీ.. ఏదైనా పార్టీని టార్గెట్ చేసి తలసాని మాట్లాడితే అడ్డుకోవడానికి కూడా సిద్దంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
నిజానికి గుంటూరు యాదవ గర్జన విషయంలో పోలీసులు సహజంగా.. అందరికీ పెట్టే నియమాలు మాత్రమే పెట్టారు. కానీ తలసాని మాత్రం… పర్మిషన్లు ఇవ్వలేదంటూ.. అనవసర రూల్స్ పెడుతున్నారని విమర్శలు చేశారు. అసలు సభ నిర్వహణ విషయంలో ఆయన పాత్ర పరిమితమని.. అన్ని పార్టీలకు చెందిన యాదవ నేతలందరూ వస్తారని… అందులో భాగంగానే తలసాని వస్తారని చెబుతున్నారు. మొత్తానికి తలసాని చెబుతున్నదానికి… గుంటూరు యాదవ సభలో జరగబోయే దానికి తేడాగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.