ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారంటూ.. కేటీఆర్ హైదరాబాద్‌లో జోస్యం చెప్పడమే కాదు.. కార్యాచరణ కూడా ఖరారు చేశారు. ఏపీలో .. కులాల కుంపట్లు పెట్టి… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా… కొన్ని సామాజికవర్గాలను మళ్లించేందుకు తన మంత్రులను రంగంలోకి దింపుతున్నారు. తెలుగుదేశం పార్టీతో.. రాజకీయ ఓనమాలు నేర్చుకుని.. చంద్రబాబు ప్రొత్సహిస్తే. ఎదిగిన తలసానికి.. ఇప్పుడు.. అదే చంద్రబాబుపై .. కులాలను ఎగదోసే టాస్క్‌ను… అప్పగించారు. ఈ మేరకు.. తలసాని వచ్చే నెల మూడో తేదీన గుంటూరులో… యాదవ సామాజికవర్గం పేరుతో బహిరంగసభ ఏర్పాటు చేయబోతున్నారు. సహజంగానే.. తలసాని ఏం చేసినా.. ఏపీలో వైసీపీ సహకరిస్తుంది కాబట్టి.. సభ జరగడం దానికి.. ఆ పార్టీకి చెందిన నేతలు జన సమీకరణ చేయడం కామనే. టీఆర్ఎస్ మంత్రికి ఏపీలో ఏం పని అని వైసీపీ ప్రశ్నిస్తే.. వారు వచ్చే అవకాశమే ఉండదు. కానీ.. టీఆర్ఎస్ నేతల రాక వల్ల.. తమకు లాభం జరుగుతుందని… వైసీపీ నేతలు ఆశిస్తున్నారు.
పైగా.. తెలుగుదేశం పార్టీకి.. బీసీలు అండగా ఉంటున్నారు. ఆ వర్గం మద్దతును.. దూరం చేస్తే.. ఆటోమేటిక్‌గా తమకు లాభం జరుగుతుందని.. వారు ఆశిస్తున్నారు. అందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను రంగంలోకి దింపుతున్నారు. నిజానికి తలసానికి… యాదవ్ అనే పేరు.. పదవులు పొందడానికే ఉపయోగపడుతోంది. ఆయనకు తెలంగాణలోనే… ఆ సామాజికవర్గానికి నాయకత్వం వహించే పరిస్థితి లేదు. అయినా.. ఏపీలో యాదవులకు నాయకత్వం వహిస్తా.. అంటూ.. వైసీపీకి ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. తలసాని విషయంలో తెలుగుదేశం పార్టీ బలహీనత కూడా బయటపడుతోంది. తలసానికి.. ఏపీ టీడీపీ నేతల్లో బంధుత్వం ఉంది. వారెవరూ.. తలసానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటం లేదు. అయినా చంద్రబాబు వారిని ప్రొత్సహిస్తున్నారు. తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు .. టిక్కెట్ ఖరారు చేశారు.
అదే సమయంలో… వైసీపీ కోసం… చేరికల వ్యవహారాన్ని కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్… చూస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ తోట త్రిమూర్తులు ఆయనతో సమావేశమవడమే దీనికి సూచిక. వైసీపీ తరపున… ఇచ్చే హామీలు… టీఆర్ఎస్ ప్రభుత్వం తరపున.. హైదరాబాద్ లో ఉన్న వ్యాపారాలకు.. అడ్డంకులు రాకుండా ఉండటం లాంటి వ్యవహారాలను… తలసాని పర్యవేక్షిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయన నేరుగా.. బహిరంగ సభ పెట్టే సాహసం చేస్తున్నారు.