తెలంగాణ రాజకీయ భాషను నేతలు పరిధి దాటించేస్తున్నారు. పెద్ద స్థాయిలో ఉన్న వారు కూడా తగ్గట్లేదు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నయి. ‘‘ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతుండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందు.. పిసికితే పాణం పోతది’ అని రేవంత్‌రెడ్డినుద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తలసాని చేసిన కామెంట్లు దుమారం రేపడంతో . రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తలసానిని దున్నపోతుతో పోల్చి తీవ్ర విమర్శలు చేశారు.
దున్నపోతులతో తిరిగిన దున్నపోతు తలసాని శ్రీనివాస్‌యాదవ్ అని, మొదట్నుంచి పశువుల పేడ పిసుక్కున్న అలవాటు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఉందని, అందుకే పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు గుట్కాలు నమిలే వ్యక్తులు కూడా తన గురించి మాట్లాడే వాళ్ళేనా అని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ కు అంత పిసుకుడు కోరిక ఉంటే,ఎక్కడికి ఎప్పుడు రావాలో చెబితే తాను వస్తానని,అప్పుడు ఎవరు ఏం పిసుకుతారో అర్థమవుతుందని సవాల్ చేశారు.
కేసీఆర్ కాళ్లు పిసికినట్టు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డిని పిసకటం అంటూ మండిపడ్డారు. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అని పేర్కొన్న రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసిన, కేటీఆర్ సంక నాకినా ఈ స్థాయికి రాలేరని తేల్చిచెప్పారు. ఇంకా ఏదైనా మోజుంటే, మోజు తీర్చుకోవాలంటే తాను వస్తానని రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తేల్చి చెప్పారు.
రేవంత్ విమర్శలకు తలసాని ఊరుకునే అవకాశం లేదు. ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే లాంగ్వేజ్ మాత్రం హద్దులు దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.