కాకా పట్టడంలో పీహెచ్డీ చేస్తేనే పదవులు వస్తాయి. ఇది రాజకీయాల్లో కామన్. అయితే..ఈ కాకాపట్టుడులో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ది ప్రత్యేక శైలి. ఓ వైపు.. పదవులు ఇచ్చే బాస్‌ను… పొగడటానికి ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. ఆ బాస్‌కు వ్యతిరేకంగా ఉన్న వారిని… ఇష్టం వచ్చినట్లు తిట్టేసి.. మరో విధంగా కాకాపడతారు. అంటే.. రెండు వైపులా ప్రయత్నిస్తారన్నమాట. కేసీఆర్.. మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం చేస్తూండటంతో.. తలసాని.. డబుల్ వర్క్ అయిపోతోంది. ఓ సారి ఏపీకి వెళ్లి… తన రాజకీయ గురువు చంద్రబాబును చెడామడా తిట్టేసి వచ్చారు. దీనికి కారణం..కేసీఆర్ దగ్గర మార్కులు పొందడమే. ఇప్పుడు… పదిహేడో తేదీన.. కేసీఆర్ పుట్టిన రోజును.. భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇతర మంత్రులు కానీ..టీఆర్ఎస్ నేతలు కానీ… తలసాని పడినంత టెన్షన్ పడటం లేదు. ఆశావహులు వీలైతే.. కేసీఆర్‌ను.. లేకపోతే.. కేటీఆర్‌ను కలిసి.. తమ పేరు పరిశీలించాలని చెప్పుకుని వస్తున్నారు. కానీ తలసాని మాత్రం.. వాటితో పాటు మిగతావి కూడా చేస్తున్నారు. దీనికి కారణం… గ్రేటర్ నుంచి.. ప్రచారం జరుగుతున్న పేర్లలో.. క్రమంగా తలసాని పేరు వెనుకబడిపోవడమేనని చెబుతున్నారు. ఈ సారి గ్రేటర్ పరిదిలో టిఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. గతంలో గ్రేటర్ పరిధిలో నాయిని నర్శింహా రెడ్డి, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు మంత్రివర్గంలో చోటిచ్చారు . ప్రస్తుతం మహమూద్ అలీని మాత్రమే ఇప్పటి వరకు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పరిమితంగా జరిగే విస్తరణలో.. గ్రేటర్ నుంచి మరొక్కరికి మాత్రమే చాన్స్ వస్తుందని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అందుకే ఉద్యమకారులకు చాన్సివ్వాలనే డిమాండ్ టీఆర్ఎస్లో ఊపందుకుంటోంది. కెసీఆర్ తో ఉద్యమ కాలం నుంచి సహచరులుగా ఉన్న నాయిని, పద్మారావులకు పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతున్నారు. నిజంగా.. కొంత మంది ముఖ్య నేతల అండ లేకపోతే.. ఇలాంటి డిమాండ్లు రావని చెబుతున్నారు. మంత్రి పదవి కోసం… తలసాని.. చాలా ఎక్కువ ఆశలు పెట్టేసుకున్నారు. అందుకే… గతంలో.. కేసీఆర్‌ను… ఘోరంగా విమర్శించినప్పటికీ.. అన్నీ మర్చిపోయి… బీభత్సంగా పొగిడేస్తున్నారు. భారీ ఖర్చుతో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించబోతున్నారు. అయితే.. పదిహేడో తేదీ లోపు విస్తరణ జరిపి…అందులో చోటు దక్కకపోతే.. తలసాని ఏం చేస్తారన్నది..టీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు.. చర్చకు కారణం అవుతోంది.