“ఒక నటుడికి అన్నిటి కంటే ముఖ్యంగా కావాల్సింది… ఆత్మవిమర్శ. నా తమ్ముడు అఖిల్‌లో ఆ గొప్ప లక్షణం ఉంది. నాకు తెలిసి తనకంటే ఎవరూ గొప్పగా ఆత్మవిమర్శ చేసుకోలేరు. అలా ఆత్మవిమర్శ చేసుకోవాలంటే దమ్ము వుండాలి” అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నాడు. తనను తాను ఎన్నోసార్లు ఆత్మవిమర్శ చేసుకున్న అఖిల్ చాలా మారాడాని చెప్పాడు. తన పంథాను మార్చుకున్నాడని చెప్పాడు. అలా మార్చుకుంటూ మార్చుకుంటూ ఈ రోజు అఖిల్ ఇక్కడివరకూ ఈ మజిలీ వరకూ చేరుకున్నాడని ఎన్టీఆర్ చెప్పాడు. ఇంకా యంగ్ టైగర్ మాట్లాడుతూ “రాసి పెట్టుకోండి… ఏదో ఒక అఖిల్ అత్యుత్తమ నటుడిగా అవుతాడు. ప్రేక్షకులందరితో పాటు ఆ రోజు కోసం నేనెంతో ఎదురుచూస్తుంటా. అది ఎంతో దూరంలో లేదు. దగ్గరలోనే ఉంది. ‘మిస్టర్ మజ్ను’ ‘సినిమాతో ఆ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది” అన్నాడు. తాను ఓ అతిథిలా కాకుండా కుటుంబ సభ్యుడిలా ‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చానని ఎన్టీఆర్ తెలిపాడు. “నాగార్జున చెప్పినట్టు నేను ఆయన్ని (నాగార్జున) బాబాయ్ అంటే… ఆయన నన్ను అబ్బాయ్ అంటారు” అని తమమధ్య వున్న అనుబంధాన్ని ఎన్టీఆర్ వేదికపై చెప్పాడు. మిస్టర్ మజ్ను తప్పకుండా విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశాడు.