తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డీఫేమ్ చేయడానికి ఆయన సోదరుల్ని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ పై ఎన్ని ఆరోపణలు చేసినా రాజకీయంగా తేలిపోతున్నాయి. దీంతో రాజకీయ ప్రత్యర్థులు వ్యూహం మార్చి ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఆయన సోదరులు ఏం చేసినా తప్పేనన్నట్లుగా ప్రజెంట్ చేస్తూ.. మీడియా, సోషల్ మీడీయాల్లో హడావుడి చేస్తున్నారు.
పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన ఓ కంపెనీలో రేవంత్ రెడ్డి సోదరుడు డైరక్టర్ గా ఉండటం మహా పాపమన్నట్లుగా … ఆయన మరో సోదరుడు ఆస్ట్రేలియాలో పర్యటించడం కూడా అధికార దుర్వినియోగమన్నట్లుగా విస్తృతంగా ప్రచారం చేశారు. నిజానినికి స్వచ్చ ఓ డైరక్టర్ అయినంత మాత్రాన అందులో తప్పేమిటన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. అదే సమయంలో రేవంత్ సోదరుడు ఆస్ట్రేలియా పర్యటనలో తప్పేమిటోచెప్పడం లేదు.
తాజాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వగ్రామంలో జరిగిన గొడవల్ని.. అక్కడ జరిగిన చావుల్ని తీసుకు వచ్చి .. కొత్తగా ఏదో కనిపెట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారు. పైగా ఎందుకు దాచి పెట్టినట్లు అని కూడా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఆ చావు గురించి ఎవరికి చెప్పాలి.. బీఆర్ఎస్ నేతలకు చెప్పాలా… వాళ్లు ప్రచారం చేసే హ్యాండిల్స్‌కు చెప్పాలా ? . ఆ ఊళ్లో అందరికీ తెలుసు. ఆరు నెలల తర్వాత తప్పుడు ప్రచారాలతో.. నేరెటివ్స్తో తెరపైకి వస్తున్నారు.
ఇదంతా రేవంత్ రెడ్డి కుటుంబాన్ని.. ఆయన సోదరుల్ని టార్గెట్ చేసుకుని చేస్తున్న కుట్రలే. రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడానికి ఆయన సోదరుల భుజాలపై తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నంలో రాజకీయ ప్రత్యర్థులు గట్టి వ్యూహాలే అమలు చేస్తున్నారు.