పెళ్లి చూపులు మూవీతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్.2016 లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాదు, దర్శకుడికి కూడా చాలా మంచి పేరు తెచ్చింది. అయితే ఆయన రెండో సినిమా పట్టాలెక్కడానికి చాలా కాలం పట్టింది.
పెళ్లి చూపులు మూవీ విడుదలై రెండేళ్లు కావస్తున్న ఇంత వరకూ అతడి సెకండ్ మూవీ రిలీజ్ కాకపోవడానికి కారణం-. కథను రూపొందించేందుకే అతడు ఏకంగా ఏడాది పైగా సమయం తీసుకోవడమే. ఇప్పుడూ తన రెండో సినిమాకి “ఈ నగరానికి ఏమైంది” అనే టైటిల్ ను ఖరారు చేశాడు. సిగరెట్ యాడ్ లో వచ్చే ఈ వాక్యం చాలా పాపులర్ అవడం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో, కామెడీ చిత్రంగా, అందరూ కొత్తవారితో నిర్మిస్తున్న ఈ మూవీ ఇటీవలే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. జులై లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే పెళ్ళి చూపులు విడుదల అయిన కొత్తలో తన రెండవ సినిమా “సైన్మా” అని తాను ఆల్రెడీ తీసిన షార్ట్ ఫిల్మ్ ఆధారంగా ఉంటుందని ప్రకటించాడు తరుణ్. మరి ఇప్పుడు ఇది ఆ సినిమా నా వేరే కథా అన్నదానిపై దర్శకుడింకా క్లారిటీ ఇవ్వలేదు.