ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఓ మహిళా సర్పంచ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. ఇప్పుడు మరో ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్య విషయంలోనూ అలాంటి ఆవే తరహా ఆరోపణలు మూడు రోజుల నుంచి హైలెట్ అవుతున్నాయి. డెయిరీ వ్యాపారం చేస్తున్న ఓ మహిళా వ్యాపారిని వేధిస్తున్న ఆడియోతో పాటు వాట్సాప్ చాట్లు వెలగులోకి వచ్చాయి. . ఆయన రాసలీలల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
సంస్థను విస్తరించే క్రమంలో పలుసార్లు తాము ఎమ్మెల్యేను కలిశామని.. అందుకు సహకరించాలంటే అమ్మాయిల్ని తన వద్దకు పంపాలని పలుమార్లు ఒత్తిడి చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన అన్యాయాన్ని వివరిస్తే పోలీసులు తనకు సహకరించలేదని చెబుతున్నారు. అయితే వారే అక్కడి జనాలను మోసం చేశారని కేసులు నమోదయ్యాయి. అటు రాజయ్య.. ఇటు దుర్గయ్య ఇద్దరిపై గతంలోనూ వివాదాలు ఉన్నాయి. పలు భూ వివాదాలతో పాటు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి వ్యవహారంలోనూ ఆయన వివాదాస్పద నేతగా ముద్రపడ్డారు.
ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేల వ్యవహారాలు బీఆర్ఎస్ హైకమాండ్‌కు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. గతంలో ఓ మంత్రి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఇలాంటివి ఇంకా ఎన్ని బయటకు వస్తాయోనని బీఆర్ఎస్ పెద్దలు కూడా కంగారు పడుతున్నారు. సాధారణంగా ఇలాంటివి మీడియాలో హైలెట్ అవుతాయి. అందుకే ఎమ్మెల్యేలు ఇలాంటి వివాదాల జోలికి వెళ్లవద్దని హెచ్చరికలు పంపుతున్నారు. కానీ ఎప్పుడో చేసేసినవి ఇప్పుడు బయటకు రాకుండా అడ్డుకోవడం ఎలా అని ఇలాంటి వ్యవహారాల్లో పండిపోయిన వారు మథనపడుతున్నారు.