పరిపాలనలో చంద్రబాబు సమర్థత వందకు వంద శాతం కనిపిస్తున్నా… టీడీపీ క్యాడర్ మాత్రం అంత హ్యాపీగా లేదు. ప్రజలు టీడీపీకి అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయమనో.. పథకాలు ఇవ్వాలనో కాదని.. కేవలం పగ తీర్చుకోవడం కోసమేనని వాదించేవారు ఎక్కువగా ఉన్నారు. ఆ పగ టీడీపీ నేతలది కాదు.. ప్రజల్ని. ఐదేళ్ల పాటు వైసీపీ రాక్షసులు పీడించుకు తిన్నారని వారందరికీ వడ్డీతో సహా చెల్లించాలని కోరుతున్నారు. కానీ పాలన ప్రారంభమై యాభై రోజులు దాటినా పూర్తి స్థాయిలో సాత్విక పాలన జరుగుతూండటంతో వారిని నిరాశకు గురి చేస్తోంది.
చంద్రబాబు చట్టబద్దమైన పాలన మాత్రమే ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ ఆ చట్టాలను వైసీపీ నేతలు ఇప్పటికీ చుట్టాలుగానే చేసుకున్నారు. కక్ష సాధింపులు అన్న పేరు వస్తుందేమో అని హత్యాయత్నం కేసుల్లోనూ 41A నోటీసులు ఇచ్చి వైసీపీ నేతల్ని పంపేస్తున్నారు. బూతులతో రెచ్చిపోయిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని పట్టించుకోలేదు. వారు మళ్లీ ఇప్పుడు తమ విషం చిమ్మడం ప్రారంభించారు. టీడీపీ నేతలు, కార్యకర్తల్ని వేధించిన అధికారులు చాలా మంది ఇంకా కాళ్ల ముందే ఉన్నారు. ఈ పరిస్థితులు టీడీపీ కార్యకర్తల్ని అసహనానికి గురి చేస్తున్నాయి.
Read Also : పెద్దిరెడ్డిపై అనర్హత వేటు కత్తి వేలాడుతుందా?
నిజానికి కార్యకర్తలు కోరుకున్నది చేసి తీరాల్సిన బాధ్యత టీడీపీ అధినాయకత్వంపై ఉన్నది. ఎందుకంటే.. వారు బాధలు పడటమే కాదు… తమ పార్టీ ముఖ్యనేతల్ని కూడా వేధించారని.. దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అనుకుంటున్నారు. ఆ కసితోనే పోరాటం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓ ఊపు వచ్చేలా చేయడానికి వీరు ఇచ్చిన సహకారం తక్కువ కాదు.
కానీ చంద్రబాబు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం సరి కాదని.. సరైన సమయంలో పద్దతిగా నిర్ణయాలు తీసుకుందామని అంటున్నారు. తప్పు చేసిన వాళ్లను చట్ట పరంగానే బుక్ చేద్దామని చూస్తున్నారు. అయితే ఆయనకు ఉన్నంత సహనం క్యాడర్ కు లేదు. అందుకే ఆవేశపడుతున్నారు. వచ్చే జనవరి వరకూ వారు తాము అనుకున్న ఎఫెక్ట్ కోసం ఎదురు చూసే అవకాశం ఉంది.