ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన సందర్భంగా.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్… టీడీపీకి ప్రచారాస్త్రంగా దొరికింది. అందులో… తనపై 31 క్రిమినల్ కేసులు ఉన్నట్లు.. జగన్మోహన్ రెడ్డి… కేసు వివరాలతో సహా పక్కాగా పేర్కొనడంతో.. ఇతరత్రా సమాచారం.. సేకరించాల్సిన అవసరం టీడీపీ నేతలకు లేకుండా పోయింది. దేశంలో.. ఇన్ని కేసులున్న వ్యక్తి.. ఎన్నికల బరిలో ఎక్కడా నిలబడటం లేదని.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారంటూ.. టీడీపీ నేతలు… విస్తృతంగా విమర్శలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద అఫిడవిట్‌ను దాఖలు చేశారని, 31 కేసుల్లో నిందితుడిగా, ఇన్ని నేరాలతో ఇంకెవ్వరూ అఫిడవిట్ దాఖలు చేయరని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇప్పటి వరకూ జగన్ నేర చరిత్రను… చంద్రబాబు చెప్పేవారు. ఇక నుంచి ప్రచారసభల్లో ఈ అఫిడవిట్‌ను కూడా హైలెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. పైగా ఆస్తుల వివరాల్లో.. చాలా వరకు.. ఇప్పుడు అనుభవిస్తున్న ఆస్తుల గురించి రాయలేదు. బెంగళూరులో ఉన్న వైట్ హౌస్, హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ఇళ్లు.. వందల కోట్ల విలువ చేస్తాయి. వాటి గురించి మాత్రం అఫిడవిట్లో పేర్కొనలేదు. ఇప్పటికే కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని జగన్ కేసీఆర్‌కు అమ్మేస్తున్నాడనే భావన ప్రజల్లో బలపడుతోందని టీడీపీ నేతుల అంటున్నారు.
ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి కేసులు హైలెట్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ.. సీబీఐ, ఈడీకి చెందిన 11 కేసులు మాత్రమే.. ఉన్నాయని.. వైసీపీ నేతలు చెబుతూ వస్తూంటారు. కానీ వాటి సంఖ్య 31 అని.. వైసీపీ నేతలు అంగీకరించాల్సి వస్తోంది. ఇప్పటికే.. ఈ అఫిడవిట్ ఆన్లైన్లో వైరల్ అయింది. దీన్ని టీడీపీ ప్రచారాస్త్రంగా చేసుకుంటోంది.