రాజకీయాల్లో ఇప్పుడు ఎమోషనల్ స్ట్రాటజీస్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బకొట్టాడనికి అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రయత్నాలు చేస్తూంటాయి. జగన్ రెడ్డి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, క్యాడర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాడనికి కేసుల్ని.. అరెస్టుల్ని వాడుకున్నారు. కనీ ఇలాంటివ అసలు వర్కవుట్ కావని రాజకీయాల్లో వేధింపులు అంతిమంగా ఆ నేతగా లాభిస్తాయని చరిత్రలో ఎన్నో సార్లు రుజువు అయింది. ఇప్పుడు మరోసారి అదే నిజం అవుతోంది. మానసికంగా దెబ్బకొట్టడం అంటే ఏమిటో.. ప్రశాంత్ కిషోర్ ను తన ఇంటికి రప్పించుకోవడం ద్వారా చంద్రబాబు చేసి చూపించారు.
జగన్ రెడ్డి గెలుపు చంద్రబాబు ఇంట్లో !
నన్ను ప్రశాంత్ కిషోరే గెలిపించాడు అని జగన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే మీడియా ముందు పీకేని చూపించి ప్రకటించుకున్నారు. అంతకు ముందు ప్లీనరీలో పీకేని చూపించి మనల్ని గెలిపించబోతున్నాడని పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ పీకే.చంద్రబాబు ఇంట్లో ఉన్నారు. అంటే.జగన్ రెడ్డి గెలుపు చంద్రబాబు ఇంట్లో ఉందన్నమాట. ఇంత కంటే.. రాజకీయ ప్రత్యర్థిని మానసికంగా దెబ్బకొట్టగలిగే వ్యూహం ఉంటుందా ?. ఇప్పుడు జగన్ రెడ్డి మానసిక పరిస్థితి.. వైసీపీ క్యాడర్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం.
నిన్నటి దాకా పీకే పేరుతో ధైర్యంగా ఉన్న క్యాడర్
గెలుపుపై జగన్ రెడ్డికి నమ్మకం లేదు. ఆయన క్యాడర్ కీ . కానీ మా వెనుక పీకే ఉన్నారన్న ఓ కటౌట్ తో ధైర్యం నింపుకుని ఇంకా పని చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడా పీకే కటౌట్ టీడీపీ కాంపౌండ్ లోకి వెళ్లిన తర్వాత ఎవరికైనా గుండె జారిపోకుండా ఉంటుందా ?. ఇప్పటికే ఐ ప్యాక్ పేరు మీదనే మొత్తం నడుస్తున్నాయి. అంటే.. ఉద్దేశపూర్వకంగా తమ చేత చేయించాల్సినవన్నీ చేయించేసి.. ఇప్పుడు గంగలోకి నెట్టేస్తున్నారా అన్న భావన రాకుండా ఉంటుందా..? . వైసీపీ క్యాడర్ ధైర్యంపై ఇంత కన్నా ఘోరమైన దెబ్బపడుతుందా ?
అందరూ దూరమయ్యారు.. జగన్ రెడ్డికి ఓటమే మిగిలింది !
గత ఎన్నికలకు ముందు తల్లి,, చెల్లితో పాటు జగన్ రెడ్డి కోసం పని చేసిన ఎంతో మంది దూరమయ్యారు. చివరికి పీకే కూడా దూరమయ్యారు. దూరం అవడమే కాదు.. వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఇంత కంటే.. పరాజయం ఓ లీడర్ కు ఉండదు. ఎన్నికల్లో నిలబడిన తర్వాత బ్యాలెట్ ద్వారా వచ్చే పరాజయం లాంఛనమే. అసలు పరాజయం ఎప్పుడో ప్రారంభమయింది. ఎండింగే మిగిలింది.