స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పోటీ చేద్దామని కొందరు.. పోటీ చేయకపోవడం మంచిదని కొందరు చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టుకున్నారు. ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో ఓటర్ల మద్దతు కూడగడితేనే పోటీ చేద్దామని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. అయితే పోటీ చేద్దామంటున్న వారు ఓటర్ల మద్దతుపై స్పష్టత ఇవ్వకపోవడంతో .. చంద్రబాబు కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు.
నామినేషన్ల దాఖలుకు మంగళవారమే తుది గడువు. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేస్తున్నారు. టీడీపీ పోటీ చేయకపోతే ఆయన కంటే హ్యాపీ లీడర్ ఉండరు. మళ్లీ చట్టసభలకు వెళ్లిపోతారు. ఖర్చు కూడా ఉండదు. టీడీపీ పోటీ పెడితే మాత్రం.. గెలుస్తారో లేదో తెలియదు కానీ.. ఖర్చు మాత్రం భారీగానే ఉంటుంది. అందుకే ఆయన టీడీపీ పోటీ పెట్టకపోతే బాగుంటుదని అనుకుంటున్నారు.
Read Also :రేవంత్ అమెరికా టూర్ అమేజింగ్ – పీఆర్ ఫెయిల్ !
చంద్రబాబు ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదేమీ సాధారణ ఎన్నిక కాదు కాబట్టి చివరి క్షణంలో నిర్ణయం తీసుకుని పోటీకి నిలబెట్టినా ఇబ్బందేమీ ఉండవు. వైసీపీ ఓటర్లు కనీసం ఓటింగుకు రాకుండా… అయినా చేయాలని అనుకుంటున్నారు. ఓటర్ల అంశంపై పని చేస్తున్న టీడీపీ నేతలు క్లారిటీ ఇస్తే చంద్రబాబు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేదు. పోటీ చేస్తే గెలిచి తీరాలి… ఓడిపోతే … బలం లేపోయినా పోటీ చేశారన్న పేరు వస్తుంది. అందుకే చంద్రబాబు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.