తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 126 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించారు. ఇందులో… సీనియర్లతో పాటు… యువకులకూ ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికైన తర్వాత అభ్యర్థుల జాబితా ఇంత త్వరగా వెలువడటం ఇదే తొలిసారి కావడం విశేషం. మిగిలిన అభ్యర్థుల పేర్లను ఈనెల 17వ తేదీ నాటికి ప్రకటించాలని భావిస్తున్నారు. 25 లోక్సభ స్థానాల్లో మెజారిటీ అభ్యర్థులను శుక్రవారం ఖరారు చేసి, జాబితా విడుదల చేస్తారు. తొలి జాబితాలో 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు. వీరిలో కొందరు వారసులకు అవకాశం ఇచ్చారు. బాపట్ల ఎంపీ మాల్యాద్రి అసెంబ్లీకి మారుతుండగా… జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేయనున్నారు.
తొలి జాబితాలోని 126 మందిలో 33 మంది బీసీలు కాగా… 21 మంది ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు. ఇద్దరు మైనారిటీ అభ్యర్థులు ఉన్నారు. 70 మంది ఓసీలు ఉన్నారు. ఓసీల్లోనూ.. అన్ని సామాజికవర్గాలకు.. ప్రాతనిధ్యం కల్పించే ప్రయత్నం చేశారు. కాపులకూ… పెద్ద పీట వేశారు. అయితే ఇంకా.. 49 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇవి ఖరారు చేసిన తర్వతా.. మొత్తం 175 స్థానాలకు ఎంపికలు పూర్తయిన తర్వాతే సామాజిక సమీకరణాలపై స్పష్టత వస్తుంది.
అభ్యర్థుల విషయంలో చంద్రబాబు.. అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. కొంత మంది బలమైన నేతలు ఉన్నప్పటికి.. సామాజిక సమీకరణాల కోసం… అవకాశం ఇవ్వరు. తాడేపల్లి గూడెం అసెంబ్లీ స్థానంలో… కమ్మ సామాజికవర్గానికి చెందిన ముళ్లపూడి బాపిరాజు పోటీ చేస్తే.. విజయం ఖాయమని.. అంచనా ఉంది. కానీ.. అక్కడ సామాజిక న్యాయం కోసం.. కాపు వర్గానికి చెందిన ఈలి నానికి అవకాశం కల్పించారు. ఇలా.. మొత్తం అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత టీడీపీ చేసిన సామాజిక న్యాయంపై ఓ అంచనాకు రావొచ్చు.