టీడీపీ అధికారంలోకి వచ్చిందని చాలా చోట్ల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు చేరిపోతున్నారు. వారందర్నీ కండువాలు కప్పి ఆలింగనాలు చేసుకుని మరీ ఆహ్వానిస్తున్నారు. కానీ వారెవరూ లాయల్ కాదు. టీడీపీని ఓడించడానికి ప్రయత్నించిన వారే. ఈ విషయాన్ని మార్చిపోయి చేర్చేసుకుంటున్నారు. వారి వల్ల పైసా ఉపయోగం ఉండదని.. పైగా పరువు తీస్తారని మరోసారి స్పష్టమయింది.
పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారని ప్రకటించుకున్నారు. ఇప్పుడు వారు రివర్స్ అయిపోయి మళ్లీ మిథున్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఎందుకంటే.. తమను బెదరించారని అందుకే టీడీపీలో చేరామని వారంటున్నారు. టీడీపీలో చేరి వారికి కావాల్సిన పనులు చక్కబెట్టుకుని పోయారని పుంగనూరులో చర్చించుకుంటున్నారు. వారు రావడం వల్ల పోవడం వల్ల టీడీపీకి జరిగే మేలేం ఉండదు కానీ.. వారిని చేర్చుకునే విషయంలో తొందరపడటం వల్లే ఈ పరిస్థితి.
మిగిలిన ప్రాంతాల్లో కూడా తమ పదవులు పోతాయన్న ఉద్దేశంతోనే చాలా మంది టీడీపీలో చేరిపోతున్నారు. వారిని ఆహ్వానిస్తున్నారు. వారి పదవుల్ని ఎంత వరకు కాపాడతారో కానీ.. తమ ఉద్దేశం నేరవేర్చుకున్నాకనో.. కోరికలు తీర్చలేకపోతేనో వారంతా వెళ్లిపోతారు. అందుకే టీడీపీ ద్వితీయశ్రేణి నేతల చేరికల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనేమో.