రాజకీయాలంటే అంతే. ఎవడో కష్టపడిన దాన్ని తమ ఖాతాలో వేసుకోవడం. అధికారం ఉంది కదా అని పిలిచి.. తమ వల్లే వారికి ఆ సక్సెస్ దొరికిందని స్టేట్ మెంట్ ఇప్పించుకోవడం. అలా ఇవ్వకపోతే ఏం జరుగుతుందో కథలు కథలు అప్పటికే తెలుసుకుని ఉంటారు కాబట్టి వారు కూడా తప్పక ఇవ్వాల్సిందే. అలాంటిదే… సీఎం జగన్ సమక్షంలో ఇంగ్లిష్‌లో మాట్లాడిన బెండపూడి స్కూల్ విద్యార్థుల కష్టాన్ని వైసీపీ నేతలు దోచేశారు.
కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో బెండపూడి అనే స్కూల్ విద్యార్థులు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇదేదో బాగుందని.. పబ్లిసిటీకి పనికొస్తుందని వారిని జగన్ ను కలిసేందుకు పిలిపించారు. మాట్లాడించారు. ప్రభుత్వం పెట్టిన ఇంగ్లిష్ మీడియం వల్లనే తమకు ఇలా ఇంగ్లిష్ వచ్చిందని.. చెప్పించారు. వారికి ట్రైనింగ్ ఇచ్చిన టీచర్‌తోనూ చెప్పించారు. కానీ అసలు నిజం మాత్రం .. వేరే. అది ఓ టీచర్ ప్రత్యేకశ్రద్ధ వల్ల.. విద్యార్థుల కృషి వల్ల మాత్రమే వారు ఆ ఘనత సాధించారు.
బెండపూడి స్కూల్లో ఇంగ్లిష్ టీచర్ ప్రసాద్. ఆయన ఇంగ్లిష్‌లో పిల్లలను మెరికల్లా తయారు చేయలానుకున్నారు. బాగా ఆసక్తి ఉన్న విద్యార్థులపై దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా ట్రైన్ చేశారు. రోజుకు ఐదు పదాలు నేర్పారు. ఐదు నెలల పాటు ఈ కోర్స్ నిర్వహించారు. యాక్సెంట్ కోసం అమెరికాలో తనకు తెలిసిన వారితో …అక్కడ చదువుకున్న విద్యార్థులతో కాంటాక్ట్‌లోకి వెళ్లారు. వాళ్ళు మన బెండపూడి పిల్లలు ఆన్లైన్ లో మాట్లాడుకుంటారు. మొత్తం అలా 493 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్లలో ఒక 10-15మంది పిల్లలకు యాక్సెంట్ అద్భుతంగా వచ్చింది. వాళ్ళు ఇప్పుడు అద్భుతంగా కమ్యూనికెట్ అవుతున్నారు. వాస్తవానికి అది టీచర్ ప్రసాద్ ఓన్ ప్రాజెక్ట్. ఆయన క్రెడిట్ జగన్ ఖాతాలో వేసుకునేందుకు ప్రత్యేకంగా ఆ కార్యక్రమం నిర్వహించారు. రాజకీయాలంటే అంతే మరి..దోచుకోవడమే.. అది ప్రజాసంపద అయినా.. పక్కోడి శ్రమ అయినా సరే !