టెస్టు క్రికెట్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే WTC ( వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ) ఫైనల్ లో టీమ్ ఇండియా మరోసారి నిరాశ పరిచింది. ఆస్ట్రేలియా మరోసారి సత్తాచై టెస్టు క్రికెట్లో ప్రపంచ విజేత తామే అని నిరూపించింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో పేలవమైన ప్రదర్శనతో చతికిలబడి 209 పరుగుల తేడాతో ఓటమిపాలైంది టీమ్ ఇండియా. నిజానికి నాలుగో రోజు ఆట ముగిసేసరికి టీమ్ ఇండియా పటిష్టంగా కనిపించింది. విరాట్, రహానే మంచి భాగస్వామ్యం నెలకొల్పి ఒక దశలో ఆశలు రేపారు. ఐతే చివరి రోజు సీన్ రివర్స్ అయ్యింది.
444 పరుగుల లక్ష్యంతో 164/3తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమ్ ఇండియా.. మొదటి నాలుగు ఓవర్లు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది. విరాట్, రహనే కుడురుకునట్లే కనిపించారు. ఇంతలోనే విరాట్ వికెట్లు వెనుక దొరికిపోయాడు. తర్వాత జడేజా రెండు బంతులకే వెనుతిరగాడు. ఇలా టీమ్ఇండియా పతనానికి ఎంతో సమయం పట్టలేదు. 234 పరుగుల వద్ద టీమ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ముగిసిపోయంది. దీంతో 209 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. టీమ్ఇండియా ఫైనల్కు చేరడం ఇది రెండోసారి. ఈ సారైన ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ టైటిల్ గెలుస్తుందన్న ఆశలు ఈ ఓటమితో ఆవిరయ్యాయి.