ఐదు మ్యాచ్‌ల టీ ట్వంటీ సీరిస్‌ను క్లీన్ స్వీప్ చేసి… తిరుగులేదనుకున్న టీమిండియా.. వన్డేల్లో బోల్తా పడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో.. న్యూజిలాండ్‌కు వైట్ వాష్ చేసి.. కసి తీర్చుకునే అవకాశం కల్పించింది. తొలి రెండు వన్డేల్లో ఘోరపరాజయం పాలయింది. తొలి వన్డేలో భారీ స్కోరు చేసినా పరాజయం పాలైన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో ఓ మాదిరి స్కోరును కూడా.. చేజింగ్‌లో అందుకోలేకపోయింది. టాపార్డర్ మొత్తం కుప్పకూలింది. టెయిలెండర్లు ఆశలు రేపినా.. అది విజయం వరకూ రాలేదు. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే..టీమిండియా సిరీస్‌ని కోల్పోయింది. వైట్ వాష్ ప్రమాదంలో పడింది. రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు.
సూపర్ ఫామ్ లో ఉన్న రాస్ టేలర్ 74 బంతుల్లో 73 పరుగులు, గప్తిల్ 79 పరుగులు చేసి… ఇన్నింగ్స్ కి పిల్లర్లులా నిలిచారు చివరికి 50 ఓవర్లలో కివీస్ 273 పరుగులు చేయగలిగింది. చేజింగ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ అతి విశ్వాసానికి పోయారు. ఫలితంగా స్కోర్ బోర్డుపై వంద పరుగులు చేరకుండానే… ఐదు వికెట్లు పడిపోయాయి. తొలి ఆరుగురు ఆటగాళ్లలో ఒక్క అయ్యర్ మాత్రమే హాఫ్ సెంచరీ చేశారు. 153 పరుగుల వద్ద ఏడో వికెట్ పడటంతో.. పరాజయం ఖాయమనుకున్నారు. కానీ రవీంద్ర జడేజా… సైనీ.. సాధికారికంగా ఆడుతూ ఆశలు పెంచారు.
కానీ.. 229 పరుగుల వద్ద సైని… కాసేపటికే చాహల్ కూడా వెనుదిరగడంతో…పరాజయం ఖాయమయింది. 55 పరుగులు చేసిన జడేజా.. చివరి వికెట్ గా వెనుదిరిగారు. దాంతో ఘోరపరాజయం ఖాయమనుకున్న టీమిండియాకు 22 పరగుల తేడాతో ఓడి.. కాస్త పరువు నిలుపుకుంది. మూడో వన్డే మంగళవారం జరుగుతుంది. టీ ట్వంటీల్లో తిరుగులేదనుకున్న ఆటతీరు చూపిన టీమిండియా.. వన్డేల్లో తేలిపోవడం.. అభిమానులను నిరాశ పరుస్తోంది.