జాతీయ రాజకీయాలపై కేసీఆర్ తనదైన ముద్ర వేసేందుకు ప్రగతి భవన్ వేదికగా సైలెంట్‌గా కార్యకలాపాలు చక్క బెడుతున్నారు. తాజగా బీహార్ నుంచి ఆర్జేడీ బృందం వచ్చి ఆయనతో సమావేశం అయింది. లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఇప్పుడు ఆర్జేడీని సమర్థవంతంగా నడుపుతున్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చినంత పని చేశారు. ఇప్పుడు ఆయన ప్రగతి భవన్‌కు వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వీరి చర్చ జాతీయ రాజకీయాల గురించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
. రెండు రోజుల కిందటే లెఫ్ట్ పార్టీల ముఖ్య నేతలు పినరయి విజయన్, సీతారాం ఏచూరీ ప్రగతి భవన్‌కు వచ్చారు. వారితో విందు భేటీ నిర్వహించిన కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ కార్యాచరణపై చర్చించారు. ఇప్పుడు తేజస్వియాదవ్‌ను కూడా అదే వ్యూహంతో ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. గత నెలలో ఆయన తమిళనాడు వెళ్లి స్టాలిన్‌ను కలిశారు. గతంలో ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్లి పార్టీ నేతలను కలిసేవారు. ఇప్పుడు వారిని ప్రగతి భవన్‌కు ఆహ్వానిస్తున్నారు.
కేసీఆర్ జాతీయ స్థాయిలోధర్డ్ ఫ్రంట్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. గతంలో ఆయన చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కానీ ఇప్పుడు గుంభనంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాల్లో బలంగా ఉన్న మరికొన్ని ప్రాంతీయ పార్టీల నేతలతో కేసీఆర్ త్వరలోనే సమావేశం అయ్యే అవకాశం ఉంది. కొంత మందిని ప్రగతి భవన్‌కు ాహ్వానించారని.. మరికొంత మందిని కేసీఆర్ వెళ్లి కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.