కేసీఆర్‌ను జైలుకు పంపుతా…పంపుతా అని హడావుడి చేసిన బండి సంజయ్‌ను తెలంగాణ సర్కార్ చివరికి జైలుకు పంపేసింది. ఆయనకు బెయిల్ కూడా రాలేదు. తెలంగాణ రాజకీయాలు రోజంతా బీజేపీ చుట్టే తిరిగాయి. బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేయడం… ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపడం చకచకా జరిగిపోయాయి. ఆయనకు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే బండి సంజయ్‌ను అలా అరెస్ట్ చేయడాన్ని బీజేపీ కావాల్సినంత అడ్వాంటేజ్‌గా తీసుకుంది., రోజు మొత్తం మీద వరుస పెట్టి టీఆర్ఎస్ పై నేతలు విరుచుకుపడ్డారు. చివరికి బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా బండి సంజయ్ ఆఫీసుకు ఫోన్ చేశారు. ఉద్యోగుల కోసంపోరాడుతున్న వైనం బాగుందని.. కంటిన్యూ చేయాలని ప్రోత్సహించారు.
అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా రాజకీయం చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బెంగాల్ రాజకీయాలు తెలంగాణలో చెల్లవని ఢిల్లీ నుంచే హెచ్చరించారు. ఇక ఇతర బీజేపీ నేతలందరూ పార్టీ ఆఫీసులో సమావేశమై కార్యచరణను ఖరారు చేసుకున్నారు. జేపీ నడ్డానుతెలంగాణకు పిలిపించి… ఆయనతో జైల్లో ఉన్న బండి సంజయ్కుపరామర్శ ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నారు. మరో వైపు బండి సంజయ్ ఏమంత నేరం చేశారని… ఎందుకు తెలంగాణ సర్కార్.. పోలీసులు అంత తీవ్రంగా స్పందించారన్న చర్చ టీఆర్ఎస్లోనూ నడుస్తోంది.
గతంలో కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు.. ఇతరకారణాల వల్ల బండి సంజయ్‌పై ఉన్న ఆగ్రహం అంతా… తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఇలా తీర్చుకున్నారని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ సర్కార్ ఓవరాక్షన్ తమకు కలసి వస్తుందని బీజేపీ నేతలు…,తదుపరికార్యాచరణ ఖరారు చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారాలన్నీ బీజేపీకి బాగానే కలిసి వస్తున్నాయి.