ఎస్సీ రిజర్వేషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కొద్ది నిమిషాల్లోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న పోరాటం ఫలించిందని, సుప్రీం కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి మాల-మాదిగ ఉప కులాల వర్గీకరణ చేపడతామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యా, ఉద్యోగ-ఉపాధి రంగాల్లో వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పినందున, వెంటనే ఏబీసీడీ వర్గీకరణ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్సీ వర్గీకరణకు తొలగిన అడ్డంకులు…
భవిష్యత్ లో వచ్చే విద్యా, ఉద్యోగ-ఉపాధి నోటిఫికేషన్లతో పాటు ప్రస్తుతం ఉన్న వివిధ దశల్లో ఉన్న నోటిఫికేషన్లలో కూడా మాల, మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేస్తామని సీఎం సభలో ప్రకటించారు. అవసరం అయితే ఇందుకు అనుగుణంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని సభకు తెలిపారు.