ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఎందుకు ఆలస్యమవుతున్నాయన్నదానిపై వరుసగా కోర్టుల్లో పిటిషన్లు పడుతున్నాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లోపు జగన్ అక్రమాస్తుల కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టులో హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించారు. జగన్, సీబీఐలకు తెలంగాణ హైకోర్టు సీజే బెంచ్ నోటీసులు జారీ చేసింది. గతంలో జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై జోగయ్య తరపు లాయర్ వివరణ ఇచ్చారు. ఈ వివరణతో హైకోర్టు సీజే ధర్మాసనం సంతృప్తి చెందింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకరించింది.
నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చారు. ప్రతివాదులు జగన్, సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి పిటిషన్ సుప్రీంకోర్టులో గత శుక్రవారం రఘురామకృష్ణరాజు దాఖలు చేశారు. కేసుల్లో వేల సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు, వాయిదాల పిటిషన్లు వేస్తున్నారవి వేరే రాష్ట్రానికి తరలించాలని రఘురామ కోరారు. 3071 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించారు. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందని.. వందల కొద్ది డిశ్చార్జి పిటిషన్లు వేసినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు జగన్ తో పాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
మరో వైపు జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నరారని .. బెదిరింపులకు పాల్పడుతూ అవినీతి చేస్తున్నరని .. తమ అక్రమాస్తుల కేసుల్లో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఓ ఫిర్యాదును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారు. వారి బెయిల్ రద్దు చేయాలని కోరారు. త్వరలో సీబీఐ కోర్టులో ఇదే విజ్ఞప్తితో పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నారు. వచ్చే ఒకటి, రెండు నెలల్లో జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక అడుగులు పడే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు భావిస్తున్నయి.