తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలు ఇవ్వాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో ప్రశ్న వేశారు. వెంటనే కేంద్రం… బహిరంగ మార్కెట్ రుణాలు, కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల వివరాలను మొత్తం బయట పెట్టేసింది. తెలంగాణ ఆవిష్కరణ జరిగే నాటికి రూ. 75,577 కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడు రూ. 4,33,817.6 కోట్లకు చేరాలని తెలిపింది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్న అప్పులు మాత్రమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిసి చేసిన అప్పులు ఉన్నాయి. తెలంగాణ అప్పుల గురించి ఇంత డీటైల్గా చెప్పిన కేంద్రం.. ఏపీ అప్పులపై బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణం గురించి మాత్రం పూర్తి వివరాలు ఇవ్వదు.
ఏపీ అప్పులపై కేవలం ఆర్బీఐ తీసుకున్న రుణాల వివరాలే ఇస్తుంది. వీటిని చూపించి వైసీపీ నేతలు .. తాము తక్కువ శాతమే అప్పు చేశామని ప్రకటిస్తూ ఉంటారు. నిజానికి ఏపీ అప్పు రూ. పది లక్షల కోట్లకు దగ్గర అయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలు కాకుండా బ్యాంకుల నుంచి ఏదో ఓ కార్పొరేషన్ పేరుతో పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటూనే ఉన్నారు. వాటిని ఇష్టారీతిన ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ వివరాలను కేంద్రం ఎప్పుడూ వెల్లడించడం లేదు. కాగ్ అడిగినా రాష్ట్రం కూడా వివరాలు గోప్యంగానే ఉంచుతోంది. అయినా కేంద్రం నోరు మెదపడం లేదు.
రాష్ట్రాలు నిధులను దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. అప్పుల విషయంలో జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. కానీ పైకి మాత్రం ఇలాంటి మాటలు బాగా చెప్పే కేంద్రం చేతల్లో మాత్రం.. ఏపీ ప్రభుత్వానికి కావాల్సినంత సాయం చేస్తూంటారు. అప్పులకు పర్మిషన్లు ఇప్పిస్తూంటారు. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని బ్యాంకులు దగ్గరగా అప్పులు ఏపీ ప్రభుత్వం ఎక్కవగా చేస్తూ ఉంటుంది.