తెలంగాణ రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో పేపర్ లీకేజీ అంశంపైనే పోరాటం చేస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాంపై రచ్చ జరిగింది. కానీ హఠాత్తుగా సీన్ అంతా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారమే హైలెట్ చేసుకుంటున్నారు. కవిత ఇష్యూతో బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టవచ్చు కానీ నేరుగా ప్రజలపై ప్రభావం చూపదు. కానీ టీఎస్పీఎస్సీ వ్యవహారం మాత్రం అలా కాదు. నేరుగా ప్రజలపై చూపిస్తుంది. యువతలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి కన్నా.. ఎక్కువగా టీఎస్పీఎస్సీ లీకేజీల గురించే పోరాటం చేస్తున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ దూసుకెళ్తున్నాయి. ఈ అంశంపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-1, ఇతరాత్ర పరీక్షలకు దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తు న్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని కష్టపడి సాధించు కోవాలని.. లక్షల మంది నిరుద్యోగులు సిరియ్స్గానే ప్రిపేర్ అవుతున్నారు. ఈ పేపర్ లీకేజీ వల్ల.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు నిరాశ, నిస్రృలకు లోనయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపైన నిరుద్యోగులు కోపంగా ఉండి తమ వ్యతిరేకతను బహటంగానే వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల్లో ఉన్న ఈ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలనే ఆలోచనతో రాజకీయ పార్టీలు ఉన్నాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణను తీసుకుంటోంది. విద్యార్థి, నిరుద్యో గులతో పాటు వివిధ సంఘాలు, పార్టీలతో కలిసి క్షేత్ర స్థాయిలో ఉద్యమించేందుకు సిద్ధం అవు తోంది.
బీజేపీ కూడా ధీటు గానే కార్యక్రమాలు చేపడుతోంది. లీకేజీ బయటపడిన రోజున బీజేపీ నేతలే ఎక్కువ ఉద్యమం చేశారు. కేసుల పాలై బీజేపీ కార్యకర్తలు జైలుకు కూడా వెళ్లారు. తర్వాత కాంగ్రెస్ ముందుకు వచ్చినప్పటికీ.. బీజేపీ మాత్రం తగ్గడం లేదు. పోరాటం ఉద్దృతంగా చేస్తోంది. యువతను పూర్తి స్థాయిలో ఆకట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కేలా చేస్తే విజయం సులువు అవుతుందని రెండు పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఆ దిశగా కార్యాచరణను ఖరారు చేసుకుంటున్నాయి. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్ని టీఎస్పీఎస్సీ కేసు మార్చేసిందని అనుకోవచ్చు.