తెలంగాణ రాజకీయాలు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ ఇవ్వడం.. ఆయన స్పీకర్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లకముందే ఆమోదం తెలియచేయడం కూడా అయిపోయియి. దీంతో రాజగోపాల్ రెడ్డి మాజీ అయిపోయారు. అందరూ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశారు. నవంబర్, డిసెంబర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాలతో పాటు మునుగోడు ఉపఎన్నిక జరికే చాన్స్ ఉంది.
ఉపఎన్నికకు అన్ని పార్టీలు రెడీ అయిపోయాయి. అక్కడ త్రిముఖ పోరు జరగనుంది. మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులు బలంగా ఉంటారు. ముఖ్యంగా సీపీఐ పలుమార్లు గెలిచింది. సీపీఐ లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచేది. ఇప్పుడు సీపీఐ బరిలో ఉంటుందా లేదా అన్నదానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. అక్కడ బీజేపీకి ఎలాంటి బలం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీదే ాధారపడిగెలవాల్సి ఉంది. ఒక వేళ కోమటిరెడ్డి బలం ఏమీ లేక బీజేపీ మూడో స్థానానికో.. అంతకంటే తక్కువతో పడిపోతే.. మాత్రం ఈ ఉపఎన్నిక ద్వారా బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లవుతుంది.
అయితే అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. సెమీస్‌లో గెలిచే పార్టీ ఫేవరేట్‌గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే అన్ని పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. దుబ్బాక.. హుజూరాబాద్ ఎన్నికలు జరిగిన తీరు వేరు.. మునుగోడుకు ఎన్నిక జరుగుతున్న తీరు వేరు. కావాలని తెచ్చి పెట్టుకున్న ఉపఎన్నిక., ప్రజలు ఎలా స్పందిస్తారో కానీ.. రాజకీయ పార్టీలన్నీ మాత్రం రెడీ అయిపోయాయి.