ఆంధ్రప్రదేశ్ డేటా పేరుతో.. తెలంగాణ పోలీసులు.. ఏకంగా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తాం అంటూ బెదిరిస్తున్నారు. ఈ కేసులో.. ఏకంగా ఏపీ పోలీసులపైనా కేసు పెట్టారు. ఓ రాష్ట్రం డేటా వ్యవహారంలో మరో రాష్ట్రం.. ఇలా అత్యుత్సాహం ప్రదర్శించడం అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగి ఉండదు. మొదటి సారి జరిగింది. ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పోలీస్ వార్‌గా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణ పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని .. పోలీస్ తేలివి తేటలతోనే వడిపించారు. అసలు మొదట ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి అనే పేరును పూర్తిగా తప్పించారు. లోకేశ్వర్ రెడ్డి అనే వైసీపీ నేతను తెరముందుకు తెచ్చినా ఆయనను విజిల్ బ్లోయర్ అంటున్నారు. ఆయనకు ఎక్కడ లేని రక్షణ కల్పిస్తున్నారు.
ఏపీ పోలీసులు తమ ఇంటికి వద్దకు వచ్చారని కంప్లైంట్ ఇవ్వగానే ఏకంగా ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారు. ఏపీ డేటాకు సంబంధించి ఏకంగా ఏపీ ప్రభుత్వానికే నోటీసులిస్తామని.. సజ్జన్నార్ అనే ఐపీఎస్ అధికారి.. బెదిరిస్తూ.. రాజ్యాంగంలోని సరికొత్త అంశాలను స్పృశిస్తున్నారు. నేరం జరిగిందో లేదో కానీ.. ఆధారాలు సేకరించడానికి మాత్రం ఆది, సోమవారాలు కోర్టుకు సెలవులు చూసుకుని.. శనివారం కోర్టు సమయం ముగిసిన తర్వాత పని ప్రారంభించారు. ఈ రెండు రోజల్లోనే కోర్టులో చీవాట్లు దగ్గర్నుంచి సజ్జనార్ ప్రెస్‌మీట్ వరకు జరిగిపోయాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం.. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుబోతోందనే ఆసక్తి ప్రారంభణయింది.
ఇప్పటికే చంద్రబాబు రెండు రోజుల పాటు.. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు .. డీజీపీతోనూ.. రెండు రోజుల పాటు సమావేశం అయ్యారు. తాము ఏం చేయబోతున్నామో ఏపీ ప్రభుత్వం బయటకు రానివ్వడం లేదు. మరో వైపు ఐటీ గ్రిడ్ సంస్థ యజమాని అశోక్… కోర్టుకు సెలవులు ఉన్నందునే.. ఆజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా ఈ రోజు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఐటీ గ్రిడ్స్ కేసు.. కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.