కాంగ్రెస్ పార్టీలో తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకునే లీడర్ల సంఖ్య తక్కువేమీ ఉండదు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఎంత డీగ్రేడ్ చేయాలని చూశారో లెక్కే లేదు. రేవంత్ ను కారణం చూపించి ఎంతో మంది లీడర్లు వెళ్లిపోయారు. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. ఎవరు వెళ్లిపోయిన మొండికిపడి పార్టీకి ఊపు తీసుకు వచ్చి విజయతీరాలకు చేర్చిన నేత రేవంత్ రెడ్డి. మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసిన తర్వాతనే బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లుగా ఇతర నేతలు వచ్చి చేరారు., అలాంటి వారిలోనూ ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
పదవి తప్పితే ఆయనకు మరో రాజకీయం తెలియదు. అందు కోసమే కూర్చున్న కొమ్మను కూడా నరుక్కుంటాడు. రేవంత్ రెడ్డి సీఎంగా పాతుకుపోతే అది కాంగ్రెస్ పార్టీకి.. అందులో లీడర్ గా ఉన్న ఆయనకు మేలు జరుగుతుంది. కానీ తన సామర్థ్యానికి మించిన పదవుల కోసం ఆశలు పడుతూ… సొంత పార్టీలో కుంపట్లు పెట్టుకుంటూ పోతే ఏం వస్తుది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం అదే దారిలో వెళ్తున్నారు. ఆయనకు మంత్రి పదవి కావాలంటే.. ఆయన సోదరుడి పదవిని తీసేయాలి. పోనీ ఇద్దరికీ ఇవ్వాలంటే.. పార్టీకి ఆయనేమైనా విధేయుడా ఉంటే.. కొనఊపిరితో ఉన్న పార్టీ పీక నొక్కడానికి బీజేపీతో కలిసి మునుగోడు ఉపఎన్నిక తెచ్చిన తెచ్చిన ఘనుడు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు. పథకాల అమలుతో పాటు.. హైడ్రా వంటి నిర్ణయాలతో ఆయన ప్రజల్లో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. మిగతా వారు ఆయనకు దూరంగా ఉండిపోతున్నారు. రేవంత్ కాకపోతే ఇంకెవరు అన్న ప్రశ్న వస్తే.. రేవంత్ లేకపోతే ఇంకెవరూ ఉండరన్న సమాధానం వస్తోంది. అంతే తప్ప.. ఆ స్థాయిలో ఒక్కరు కూడా లీడర్లు లేరు. అందుకే లాబీయింగ్ లకు అలవాటుపడిన లీడర్లు.. కొత్తగా పుకార్లు రేపుకుంటున్నారు. ఉక్కపోతకు ఈ పుకార్ల ద్వారా సాంత్వన పొందుతున్నారు. కానీ ఈ రాజకీయం తమ రాజకీయ జీవితానికే దెబ్బ వేస్తుందని అంచనా వేయలేకపోతున్నారు.