అగ్ర కథానాయకుడు చిరంజీవి గద్దర్ అవార్డ్స్ పై చేసిన వాఖ్యలు చిత్ర పరిశ్రమలో కదలికలు తీసుకొచ్చాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ పేరిట చిత్ర పరిశ్రమకు పురస్కారాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించినా కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన వాఖ్యానించారు. సినీ ప్రముఖులు ముందుకొచ్చి ఆ ప్రతిపాదనకి సంబంధించిన కార్యచరణని ముందుకు తీసుకెళితే రెండో ఆలోచన లేకుండా పురస్కారాల్ని అందజేస్తామని చెప్పారు.
సిఎం రేవంత్ చేసిన కామెంట్స్ చేసిన నేపధ్యంలో చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని సినీ పురస్కారాల్ని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించాక, తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లేందుకు బాధ్యత వహించాలని ఆయా కమిటీల్ని కోరారు.
Also Read : ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రేవంత్ కోరుకుంటున్నదేంటి?
దీంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హుటాహుటిన స్పందించాయి. గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ని కోరామని పేర్కొన్నాయి. కమిటీ ద్వారా విధి విధానాలను రూపొందించి ఎఫ్డీసీ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించాయి.
కళాకారులకు ప్రభుత్వం తరపున లభించే పురస్కారమైన నంది అవార్డ్స్ను గత ప్రభుత్వాలు పక్కన పెట్టేయగా.. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అదే పురస్కారాన్ని పేరు మార్చి ‘గద్దర్ అవార్డ్స్’ పేరిట ఇకపై కళాకారులకు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.