అజిత్ సినిమాలేవీ తెలుగులో ఆడవు కానీ, ఆ కథలకు మాత్రం టాలీవుడ్ లో గట్టి గిరాకీ ఉంటుంది. పవన్ కల్యాణ్ ఎక్కువగా అజిత్ సినిమాల్ని రీమేక్ చేస్తుంటాడు. తమిళంలో అజిత్ నటించిన హిట్ సినిమాల్లో సగం.. పవన్ చేసినవే. అజిత్ తాజా చిత్రం `వలీమై`. ఈ సినిమాని తెలుగులో నూ రిలీజ్ చేశారు. అయితే.. ఈ సినిమా తెలుగు రిలీజ్ ఆపాలని ఓ నిర్మాత గట్టి ప్రయత్నాలే చేశాడు. తెలుగులో ఆపి, రీమేక్ రైట్స్ తీసుకుని, అప్పుడు తెలుగులో ఓ హీరోతో మళ్లీ తీద్దామనుకున్నాడు. అయితే.. `వలీమై` నిర్మాత బోనీ కపూర్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తెలుగు రీమేక్ రైట్స్ ఇవ్వాలంటే భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడు. అంతే కాదు.. తెలుగు సినిమాలో వాటా కూడా కావాలన్నాడట. దాంతో.. మన నిర్మాత తగ్గాడు. తీరా చూస్తే.. `వలీమై` అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తమిళంలో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అజిత్ సినిమాకి ఓపెనింగ్స్ రాలేదు. రెండో రోజే సగం థియేటర్లు ఎత్తేశారు. తెలుగు నాట సంగతి చెప్పక్కర్లెద్దు. విజజయ్, సూర్య, కార్తిలా అజిత్ కి ఇక్కడ ఫ్యాన్ బేస్ లేదు. దానికి తోడు.. రెండో రోజే.. `భీమ్లా నాయక్` వచ్చేసింది. దాంతో ఆసినిమాని ఎవ్వరూ చూడనే లేదు.