హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఉన్న కైతలాపూర్ గ్రౌండ్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను 20వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులందర్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఉత్సవాలకు కమిటీ చైర్మన్ గా టీడీజనార్దన్ ఉన్నారు. ఆయన హైదరాబాద్లో ఎన్టీఆర్ కుటుంబసభ్యులందర్నీ కలిశారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణతో కలిసి ముందుగా.. జూనియర్ ఎన్టీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జూనియర్ ను పిలిచిన తర్వాత ఇతర కుటుంబసభ్యుల ఇళ్లకు వెళ్లారు. అందర్నీ ఆహ్వానించారు. మాజీ నటుడు నందమూరి కల్యాణచక్రవర్తిని కూడా ఆహ్వానించారు.
గతంలో విజయవాడలో నిర్వహించన ఎన్టీఆర్ శత జయంతి ప్రారంభ ఉత్సవాలకు రజనీకాంత్ ను పలిచారు. అయితే బాలకృష్ణ మినహా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఎవరూ హాజరు కాలేదు. అసలు ఆహ్వానించలేదన్న ప్రచారం జరిగింది. అయితే శతజయంతి ఉత్సవాలను వంద చోట్ల నిర్వహిస్తున్నామని హైదరాబాద్ లో భారీ ఎత్తున జరపనున్న వేడుకలకు ఎన్టీఆర్ కుటుంబసభ్యులను పిలుస్తున్నామని చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు ఆ ప్రకారం అందర్నీ పిలుస్తున్నారు.
మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కల్యాణ్ రామ్ ఈ వేడుకకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. చంద్రబాబుతో కలిసి కుటుంబపరమైన కార్యక్రమాల్లో చాలా సార్లు పాల్గొన్నప్పటికీ.. బహిరంగ వేదికలపై కనిపించింది లేదు. ఎన్నికల సమయం కావడంతో ఇలా బహిరంగవేదికలపై చంద్రబాబు, ఎన్టీఆర్ కలిసి కనిపిస్తే ఎంతో మేలు జరుగుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.