ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై నమోదైన రెండుకేసులను కోర్టు కొట్టి వేసింది. ఈ తీర్పు అందర్నీ ఆశ్చర్య పరిచింది. నిర్మల్‌తో పాటు మరో చోట హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రపంచమంతా చూసింది. అయినా అక్బరుద్దీన్ ను నిర్దోషిగా ప్రకటించింది. హిందూ దేవతలను అవమానపరుస్తూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై 2012లో నిజామాబాద్ లో నమోదైన కేసును బెన్ ఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టివేసింది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దాదాపుగా నెలన్నర పాటు ఈ కేసుల్లో జైల్లో ఉండాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ కేసుల్లో సాక్ష్యాలు తెలంగాణ పోలీసులు కోర్టుకు సమర్పించలేకపోయారు. దీన్ని బీజేపీ ఆయుధంగా చేసుకుంది.
న్యాయ స్థానానికి కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలనివాటిని రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించ లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్కక్కయ్యరనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పీల్ కు వెళ్లాలని డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ కేసు తీర్పుపై రెండురోజులు ఉత్కంఠ నెలకొంది. అయనకు శిక్ష ఖాయమని అందరూ అనుకున్నారు.
కానీ కేసును నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో న్యాయమూర్తి కూడా ఇది సంబరాల చేసుకునేది కాదని మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దన్నారు. అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయన్నారు. టీఆర్ఎస్కు ఎంఐఎంకు ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అక్బరుద్దీన్ హిందువుల్ని అన్నన్ని మాటలన్నా… వదిలి పెట్టారన్న ఆరోపణలు బీజేపీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.