ఎన్నికల్లో హామీలంటే ఆషామాషీ కాదు. గెలిచిన తర్వాత ” అమ్మ మొగుడు చెప్పాడా ? ” అని వాదించి .. ప్రశ్నిస్తే సీఐడీ పోలీసులతో కుళ్లబొడిపించే రాజకీయం ప్రజాస్వామ్యం కాదు. ఇచ్చిన హామీల్ని ఇవ్వలే్దని చెప్పుకోవడం నిజాయితీ కాదు. ఇవన్నీ మన దగ్గర కనిపిస్తాయి. కానీ బ్రిటన్ లో మాత్రం అలా ఉండదు. రాజీనామా చేయాల్సిందే. నెలన్నర కిందటే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్ ట్రస్ రాజీనామా చేసేశారు. దీనికి కారణం ఆమె ఇచ్చిన ఓ హామీని నెరవేర్చకుండా… వెనక్కి తగ్గడం.
ప్రధానిగా ఎన్నికయ్యేందుకు లిజ్ ట్రస్ అనేక హామీలు ఇచ్చారు. ప్రధాని ఎన్నికల సమయంలో ఆమె ప్రత్యర్థి రిషి సునక్ కార్పొరేషన్ పన్నును 25 శాతానికి పెంచుతానని హామీ ఇవ్వగా.. లిజ్ ట్రస్ మాత్రం.. పన్నును 19 శాతం తగ్గించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆమె ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. లిజ్ ట్రస్ చెప్పినట్టుగా కార్పొరేట్ పన్నును 25 శాతానికి పెంచారు. ఇదేమిటని ప్రశ్నించిన వారికి … ఆర్థిక వ్యవస్థ బాగోలేదని కబుర్లు చెప్పారు. తర్వాత మినీ బడ్జెట్ పెట్టారు. అందులోనూ ఆమె చెప్పిన హామీలేమీ లేవు. దీంతో ఇంత మాత్రం దానికి ప్రధాని పదవిలో ఉండాలా అని అందరూ నిలదీయడంతో తప్పని సరిగా రాజీనామా చేసేశారు.
నిజానికి బ్రిటన్ పార్లమెంట్ నిబంధనల ప్రకారం మరో ఏడాది వరకూ ఆమెపై అవిశ్వాసం పెట్టడానికి కూడా అవకాశం లేదు. కానీ చెప్పిన వాటికి.. చేసిన దానికి పొంతన లేకపోవడం.. అందరూ.. నిందిస్తూండటంతో వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 98 శాతం చేసేశాని..చేస్తానని.. గతంలో ఉన్న వారు ఏమీ చేయలేదని .. ఎదురుదాడికి దిగి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. ఓ రకంగా నాణ్యమైన ప్రజాస్వామ్యం అంటే అదే కావొచ్చు.