ఎన్నికల గొడవలతో క్యాడర్ ను బలి చేసేందుకు వైసీపీ హైకమాండ్ పెద్ద ప్లానే వేసింది. ఇప్పటికే అల్లర్ల కారణంగా కొన్ని వందల మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. ఇంత జరుగుతున్నా వారికి కనీస న్యాయ సాయం అందిస్తున్నారో లేదో కూడా తెలియదు .. ప్రభుత్వం ఉంది కాబట్టి కొంత మందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పోతే మొత్తానికే చితికిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ సమయంలోనూ క్యాడర్ పై కుట్ర చేస్తోంది వైసీపీ.,
కౌంటింగ్ కేంద్రంలో అల్లర్లు చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా చెప్పడం.. దాన్ని నీలి, కూలి మీడియా విస్తృతంగా ప్రచారం చేయడం వెనుక ఊహించని కుట్ర ఉంది. ఇప్పటికే వైసీపీ పెద్దల నేర పూరితమైన ఆలోచనలపై ఇంటలిజెన్స్ సమాచారం ఉండటంతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడైనా ఘర్షణలు తలెత్తితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైసీపీతో అంటకాగే పోలీసులు ఉంటే… ఎక్కడికక్కడ కట్టడి చేశారు. అయినప్పటికీ అల్లర్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లు చేసినా కఠినమైన కేసులు పెడతారు. వాటి నుంచి బయటపడటం అంత తేలిక కాదు. జగన్ తో పాటు సజ్జల సహా అందరూ అయితే హైదరాబాద్ లేకపోతే విదేశాలలో విహరిస్తారు. కానీ .. కేసుల పాలైన వైసీపీ కార్యకర్తలు మాత్రం కుటుంబాలను క్షోభపెడుతూ జైళ్లలో గడపాల్సిందే. నమ్మిన వారినందర్నీ జైలుకు పంపే జగన్… అధికారాంతమును క్యాడర్ని కూడా వదిలి పెట్టడం లేదు.