మెగాస్టార్ చిరంజీవి 61 వ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్లో మెగా కోలాహలం బాగానే ఉన్నా… ఫంక్షన్ మాత్రం చప్పగా సాగుతున్నాయి. చిరంజీవి మెడ్లీలు తప్ప.. సభలో హుషారు లేకుండా పోయింది. మెగా హీరోలు సాయిధరమ్, వరుణ్‌తేజ్, అల్లు అర్జున్, శిరీష్ ప్రసంగాలు కూడా చప్పగా సాగాయి. చిరంజీవి ఈ వేడుకకు రాకపోవడం పెద్ద లోటైతే… ఫస్ట్ లుక్‌ని ఇంతకు ముందే విడుదల చేసేయడంతో ఈ ఫంక్షన్‌కి స్పెషాలిటీ అంటూ ఏమీ లేకుండా పోయింది. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి వచ్చి. షాక్ ఇస్తాడేమో అనుకొంటే అలాంటివేం జరగలేదు. చిరంజీవి గురించి.. ఇది వరకు మాట్లాడి కాస్త ఇబ్బందుల్లో పడిన అల్లు అర్జున్ ఈసారి పెద్దగా నోరు కదపలేదు. ముఠా మేస్త్రిలోని డైలాగ్ చెప్పి సైడ్ అయిపోయాడు. రక్తదానాలు చేసిన వారికి అవార్డులు ఇవ్వడంలో చరణ్ బిజీగా ఉండిపోయాడు. చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన కొత్త విషయాలేం ఈ ఫంక్షన్లో వెలుగులోకి రాలేకపోయాయి. అలా… చిరు ఫంక్షన్ బోరింగ్ బోరింగ్ గా సాగుతోంది.