దీపావళికి వచ్చిన సినిమాలు పెద్దగా రాణించలేదు. మూడు సినిమాలూ నిరాశ పరిచాయి. గత వారం కూడా థియేటర్ సినిమాలు లేవు. ‘అద్భుతం ‘ఓటీటీకి పరిమితమైయింది. అయితే ఈ వారం మూడు సినిమాలు థియేటర్ లోకి వస్తున్నాయి. రాజ్‌తరుణ్ ‘అనుభవించు రాజా’. శ్రీను గావిరెడ్డి దర్శకుడు. గ్రామీణ నేపథ్యంతో పాటు హైటెక్ సిటీ సాఫ్ట్ వేర్ టచ్ లో సాగే ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పబ్లిసిటీ కూడా బాగానే చేస్తున్నారు. ఈ సినిమా విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు రాజ్ తరుణ్.
సంపూర్నేష్ బాబు ‘క్యాలీప్లవర్’ సినిమా కూడా ఈ వారమే థియేటర్ లోకి వస్తుంది. హృదయం కాలేయంతో సెన్సేషన్ క్రియేట్ చ్శాడు సంపూ. అదో వెరైటీగా హిట్టు అయ్యిందా సినిమా. సంపూ నుండి సినిమా అంటే టైం పాస్ కి నవ్వుకోవాడనికి థియేటర్ కి వచ్చే ఆడియన్స్ వున్నారు. పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం కూడా సంపూకి కలిసొచ్చే అంశం. ఇంకో కామెడీ యాక్టర్ సినిమా కూడా ఈ వారం విడుదలకు సిద్దంగా వుంది. శకలక శంకర్ నటించిన కార్పొరేటర్. అయితే ఈ సినిమా గురించి పెద్ద ప్రచారం లేదు. అయితే శంకర్ హీరోగా చేసిన మొదటి సినిమా నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లారు. అదే నమ్మకంతో కార్పోరేట్ ని థియేటర్ లోకి తెస్తున్నారు. ఈ మూడు సినిమాల కంటే వెంకటేష్ దృశ్యం 2 పెద్దది, కానీ అది కాస్త ఓటీటీకి వెళ్ళిపోవడంతో ఈ వారం చిన్న సినిమాలకే పరిమితమైపోతుంది.