టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు ఉన్నంత సంక్షోభం గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు. సినిమాలు ఫ్లాప్ అయిపోయి.. రెవిన్యూ లేకనో.. లేకపోతే మరో కారణంతోనో అయితే ఇండస్ట్రీనే ఏదో విధంగా సర్వైవ్ అయ్యేది. కానీ ఓ వ్యక్తి అధికారం అనే ఆయుధంతో కుట్ర చేసి అత్యంత దారుణంగా సినిమాను చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పెదరాయుడుగా ప్రకటించుకున్న వారు మౌనం పాటిస్తే ఇండస్ట్రీ జరిగే కీడు అంతా ఇంతా కాదు. “మా” ఎన్నికల్లో గెలిచి ఇక ఇండస్ట్రీకి నేనే దిక్కు అన్నట్లుగా మాట్లాడిన మంచు ఫ్యామిలీ.. ఇప్పుడు అడ్రస్ లేదు.
టిక్కెట్ల ధరలు, టిక్కెట్ల అమ్మకాలు మొత్తం ప్రభుత్వం స్వాధీనంచేసుకోవడం, ధియేటర్లపై దాడులు ఇలా వరుసగా అసలు సినిమా ఉనికే ఏపీలో ఉండకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మంచు కుటుంబం ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తారని ఇప్పటి వరకూ భావిస్తూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ సీఎం జగన్ తనకు సమీప బంధువని విష్ణు పదే పదే చెప్పుకున్నారు.
అయితే ఆ బంధుత్వాలు ఇప్పుడు ఉపయోగించడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి వాడుకున్న బంధుత్వాలను ఇండస్ట్రీ కోసం వినియోగించడం లేదు. కనీసం ఓ ప్రయత్నం అయిా చేస్తారేమో అని చూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. ఎలాంటి ప్రకటన కూడా లేదు . దీంతో వారు అవమానించిన చిరంజీవే చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. చిరంజీవి సీఎం జగన్తో భేటీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారని తెలిసిన తర్వాతైన మంచు ఫ్యామిలీలో కదలిక వస్తుందో లేదో చూడాలన్న ఓ అభిప్రాయం మాత్రం ఇండస్ట్రీలో ఉంది.