హైదరాబాద్: దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్లో తనకు ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అని చెబుతోంది చిలుబులి సమంత. ఆయనకున్న పరిజ్ఞానం, అవగాహన, పరిశీలన అద్భుతమని సమంత అభిప్రాయమట. తన వ్యక్తిగత జీవితంలో ఎపుడైనా కుంగిపోయినట్లనిపిస్తే త్రివిక్రమ్ వద్దకు వెళతానంటోంది అమ్మడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా సమంతను తన లక్కీ మస్కట్‌గా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తాజా చిత్రాలు అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తిలలో వరసగా సమంతయే కథానాయికగా నటించగా త్వరలో నితిన్‌తో ప్రారంభం కానున్న చిత్రంలోకూడా సమంతనే బుక్ చేశారు. అయితే దీనిలో కొత్త కోణాలు వెతకటానికి ప్రయత్నించొద్దండోయ్. ఇద్దరిమధ్యా మామూలు స్నేహమే ఉంది.