తెలంగాణ బీజేపీ రాజకీయ వ్యూహాల్లో టీఆర్ఎస్ను అందుకోలేకపోతోంది. బీజేపీ బ్రాండ్ అయిన మత పరమైన రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నప్పటకీ .. ితర విషయాల్లో మాత్రం టీఆర్ఎస్ ముందు తేలిపోతున్నారు. ఈ విషయం మరోసారి రుజువైంది. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణలో హైవోల్టేజ్ రాజకీయాలు జరగనున్నాయి. దీనికి కారణం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్‌లో తెలంగాణ విమోచనా దినోత్సవాలను నిర్వహిస్తోంది. తెలంగాణ సర్కార్ కూడా విడిగా ఆ పని చేస్తోంది.
కేంద్రంతో సంబంధం లేకుండా తాము కూడా మూడు రోజుల పాటు ధూమ్ ధామ్‌గా ఈ వేడుకలు నిర్వహించనుంది. ఇందు కోసం ఎవరికి వారు ఘనంగా ప్రచారం చేసుకోవాలనుకున్నారు. బీజేపీ నేతుల హైదరాబాద్ మొత్తం హోర్డింగ్‌లు పెట్టాలనుకున్నారు. కానీ పెట్టలేకపోతున్నారు. ఎందుకే టీఆర్ఎస్ నేతలు పెట్టాలనుకోవడమే కాదు.. మొత్తం హోర్డింగ్‌లను బుక్ చేసేసుకున్నారు.
దీంతో బీజేపీ నేతలకు షాక్ తగిలినట్లయింది. నిజానికి ఇలాంటి పరిస్థితి ఇటీవల మోదీ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ నేతలకు ఎదురైంది. మోడీ సభకు ఎదురుగా కూడా టీఆర్ఎస్ హోర్డింగ్‌లే కనిపించాయి. ఆ అనుభవంతో అయినా జాగ్రత్త పడతారా అంటే అదీ లేదు. ఇప్పుడు తీరిగ్గా.. తమ ప్రకటనలు కనిపించకుండా టీఆర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించడమే బీజేపీకి మిగిలింది. లేకపోతే.. రోడ్ల పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు పెట్టుకోవడమే వారు చేయగలిగింది.