టీఆర్ఎస్లో చేరిన.. చేరాలనుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజాభిప్రాయం మేరకు… ఆ పార్టీలో చేరతామంటూ ప్రకటనలు ఇచ్చిన వారికి… ఆ ప్రజలే చుక్కలు చూపిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో భాగంగా.. ఆ పార్టీ నేతలు గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్లినప్పుడు… వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి.. టీఆర్ఎస్లో చేరిన ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రయానాయక్, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావులకు … గ్రామాల్లో చేదు అనుభవం ఎదురయింది. వారు టీఆర్ఎస్లో చేరితే.. వారి వెంట… కాంగ్రెస్ క్యాడర్ వెళ్లలేదు. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని.. ఎమ్మెల్యేలు తమ గ్రామాలకు వస్తూండటంతో… తమకు సమయం వచ్చినట్లుగా వారు… చెలరేగిపోతున్నారు
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గ్రామాల్లో ఎదురవుతున్న పరిస్థితి… కాంగ్రెస్ పెద్దలకు కాస్త మనోధైర్యం ఇస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా … టీఆర్ఎస్ తరపున… పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు. వారి తరపున ప్రచారం చేయడానికి గ్రామాలు తిరుగుతున్నారు. వారు… టీఆర్ఎస్ అభ్యర్థులపై గెలుపొందడానికి తీవ్ర స్థాయిలో శ్రమించారు. కాంగ్రెస్ నేతలందరూ.. కలసికట్టుగా పని చేశారు. ఆర్థికంగా కూడా… కాంగ్రెస్కు చెందిన నేతలు అండగా నిలబడ్డారన్న ప్రచారం ఉంది. అలాంటిది.. తమ కష్టంతో గెలిచిన.. వారు టీఆర్ఎస్లో చేరిపోయారన్న ఆగ్రహం కాంగ్రెస్ నేతల్లో ఉంది. అంతే కాదు.. టీఆర్ఎస్ లో చేరి.. ఇప్పుడు.. తన కోసం.. కష్టపడిన కాంగ్రెస్ నేతలను.. వారి అనుచరుల్ని… స్థానిక ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆగ్రహం కూడా కనిపిస్తోంది. దీంతో… అసలు రగడ ప్రారంభమయింది. అది ఫిరాయింపులపై వ్యతిరేకతగా ప్రచారంలోకి వస్తోంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలందరిపై..ఆగ్రహంగా మార్పు చేసి.. ప్రజల్లో తిరుగుబాటు తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిని టీఆర్ఎస్ ఫిరాయింపులకు కౌంటర్ ఇవ్వడానికి .. ఇది బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయకపోతే.. ప్రజలందరూ… వారిని తరిమికొట్టాలని భట్టి విక్రమార్క్ ఇప్పటికే పిలుపునిచ్చారు. భట్టి విక్రమార్క ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు. e