” ఓ మేధావి మ్యూజియం సందర్శనకు వెళ్తాడు. అక్కడ ఓ వస్తువును చూస్తూ… కింద పడేస్తాడు. దీంతో ఆ మ్యూజియం మేనేజర్ పరుగున వచ్చి.. నువ్ ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా… నువ్ పాడు చేసిన వస్తువు .. పదివేల ఏళ్ల కిందటిది అని అరుస్తాడు. దాంతో ఆ మేధావి … ఓ అంత పాతదా.. నేను చాలా విలువైనది అనుకుని భయపడిపోయానని సమాధానం చెబుతాడు “: దానికి ఆ మ్యూజియం మేనేజర్ కు ఎలాంటి కోపం రావాలి ?
ఇప్పుడు టీటీడీ ఈవో విషయంలోనూ అలాంటి ప్రజలకు, శ్రీవారి భక్తులకు.. హిందూ సంస్థలకు… అంత కంటే ఎక్కువ కోపం రావాలి. ఎందుకంటే ఆయన కూడా అదే పని చేస్తున్నారు. పురాతనమయ్యాయి అని చెప్పి… పాత మండపాలను తొలగించి కొత్తగా కట్టేస్తున్నారు. ఈ తీరు చూసి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం ప్రధాని కార్యాలయం దృష్టికి వెళ్లింది.
తిరుమలలో పార్వేట మండపం ఉంటుంది. అది శ్రీవారు వేటకు వెళ్లినప్పుడు ఉపయోగించే విశ్రాంత మందిరం. దానికి ఆరేడు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇటీవల అది పాడుబడిపోయిందని కూల్చేసి కొత్తది కట్టేశారు. గుట్టుగా సాగిపోయిన ఈ పని గురించి బ యటకు తెలిసే సరికి గగ్గోలు రేగింది. కానీ ధర్మారెడ్డి చెప్పుకోవడం… అది శిథిలమయిందని.. కూలిపోయి భక్తులకు సమస్యగా మారుతుందని కొత్తగా నిర్మించామని చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విని … భక్తులు, ఇతరులు తలలు బాదుకున్నారు. అంతటితో ఆగలేదు. ఇదేదో వర్కవుట్ అయిందనుకుని.. ఈ సారి అలిపిరి దగ్గర ఉన్న మరో మండపం పడ్డారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఓ కుట్ర ప్రకారం చారిత్రక ఆనవాళ్లను తొలిచేస్తున్నారని.. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. పురందేశ్వరిని తీసుకెళ్లి చూపించారు. ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై పీఎంవో ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. అసలు పురాతమైనవాటిని రక్షించుకోవాల్సింది పోయి… కూలిపోతాయని కొత్తవి కట్టేస్తున్నామని చెప్పే ఆలోచన వచ్చిన ధర్మారెడ్డిని ఖచ్చితంగా తగిన విధంగా సన్మానించాలన్న డిమాండ్లు చాలా మంది దగ్గర్నుంచి వస్తున్నాయి.